Ads
టాలీవుడ్ నటి శృతి హాసన్ జయాపజయాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ లో దూసుకెళ్తున్నారు. స్టార్ కిడ్ అయినా కూడా స్వయం కృషితో ఇండస్ట్రీ లో నిలబడి తన టాలెంట్ తోనే నటి గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. శృతి సింగర్ కూడా. మ్యూజిక్ డైరెక్టర్ గా, డాన్సర్ గా శృతి పలు ఆల్బమ్స్ ను రూపొందించి అభిమానులను సంపాదించుకుంది. అయితే, సింగర్ గా సక్సెస్ అయ్యాక నటి గా కెరీర్ ను ప్రారంభించింది.
Video Advertisement
టాలీవుడ్ బడా హీరోస్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి టాప్ హీరోల పక్కన నటించడంతో శృతి రేంజ్ పెరిగిందనే చెప్పాలి. సౌత్ లో సక్సెస్ సాధించడంతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది శృతి హాసన్.
ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమాలో బిజీ గా ఉన్న శృతి బాలయ్యతో ఓ సినిమా, చిరంజీవితో కూడా ఓ సినిమా చేయనున్నారు. అయితే.. ఇటీవల శృతి హాసన్ కు సంబంధించి ఆమెకు ఆరోగ్యం బాలేదంటూ.. హాస్పిటల్ బెడ్ పై దారుణమైన పొజిషన్ లో ఉన్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీటిపై శృతి హాసన్ స్పందించారు.
ఈ వార్తలలో నిజం లేదని.. కొందరు కావాలనే చేస్తున్నారని శృతి హాసన్ వివరణ ఇచ్చారు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. నాకు ఉన్న ప్రాబ్లెమ్ పీసీఓఎస్ మాత్రమేనని.. ఇది చాలా మంది మహిళలలో సాధారణంగా కనిపించే సమస్యేనని పేర్కొన్నారు. ఇది ఒక్కటి పట్టుకుని తప్పు దోవ పట్టిస్తున్నారని.. నేను హెల్దీగా , హ్యాపీగా ఉన్నానని పేర్కొంది.
End of Article