తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ‘వై దిస్‌ కొలవెరి!’ పాటతో మొదలై ‘రఘువరన్‌ బీటెక్‌’తో మనలో ఒకడై పోయాడు. ఇక తాజాగా సార్ సినిమాతో నేరుగా తెలుగు సినిమా తీసి హిట్ కొట్టాడు ధనుష్. ధనుష్‌ నటుడు మాత్రమే కాదు. ఆయనలో దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయిత, కథా రచయిత ఉన్నారు.

Video Advertisement

నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌, హాలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారు ధనుష్. ‘రంజనా’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి ‘షబితాబ్‌’తో ప్రశంసలు అందుకున్నారు. ఇటీవలే అక్షయ్​కుమార్​తో ‘అత్రాంగి రే’ లో నటించారు. ‘ది ఎక్ట్స్రార్డనరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ ఆయన నటించిన తొలి ఆంగ్ల చిత్రం. రీసెంట్ ​గా ‘ది గ్రేమ్​ మ్యాన్’​ చిత్రంతో అభిమానులను పలకరించారు.

 

what happened to dhanush..!!

అయితే తాజాగా ధనుష్ ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. ఆ ఫోటోలను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. పింక్ స్వెట్ షర్ట్ ధరించిన ధనుష్ పొడవైన జుట్టు… గడ్డంతో గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. తన తదుపరి చిత్రం కెప్టెన్ మిల్లర్ లోని లుక్ కోసం ధనుష్ జుట్టు అలా పెంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త లుక్ చూసిన ఫాన్స్.. సడన్ గా చూసి రామ్ దేవ్ బాబా అనుకున్నాం అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

 

what happened to dhanush..!!
ధనుష్ ప్రస్తుతం దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌తో యాక్షన్ చిత్రం కెప్టెన్ మిల్లర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. అలాగే ఈ చిత్రంలో ధనుష్ మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. జాన్ కొక్కెన్, నివేదిత సతీష్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో కూడా ధనుష్ ఒక చిత్రం చేయనున్నట్లు సమాచారం. నదీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ : “పవన్ కళ్యాణ్” లాగానే… తమ సినిమాలని తామే “డైరెక్ట్” చేసుకున్న 10 హీరోస్..!