సహాయంతో నడవడం… చెప్పులు కూడా వేసుకోలేకపోవడం… ప్రభాస్ కి ఏమయ్యింది..?

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయు నది తీరాన గ్రాండ్‏గా విడుదల చేశారు. రిలీజ్ అయిన కాసేపట్లోనే టీజర్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది.

అయోధ్య లో జరిగిన టీజర్ రిలీజ్ ఫంక్షన్ బాగానే జరిగింది కానీ అక్కడ జరిగిన ఒక విషయం డార్లింగ్ ఫాన్స్ ని కలవరానికి గురి చేస్తోంది. ఆ ఈవెంట్ లో ప్ర‌భాస్ న‌డ‌వ‌టానికి చాలా ఇబ్బంది ప‌డుతున్నాడు. క‌నీసం చెప్పులు వేసుకోలేక‌పోతున్నాడు. ప‌క్క‌నున్న కృతి స‌న‌న్‌ , డైరెక్ట‌ర్ ఓం రౌత్‌ చేతులు ప‌ట్టుకుని స‌పోర్ట్ చేస్తే చెప్పులు వేసుకోవ‌టం , మెట్లు దిగ‌టం వంటి ప‌నులు చేస్తున్నారు. వీడియోల్లో ఆ విష‌యం స్ప‌ష్టంగా తెలిసి పోతుంది.

what happened to prabhas.
మొన్నటికి మొన్న మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. అందుకే విదేశాల్లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. సలార్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు. మారుతి సినిమాను కూడా హోల్డ్‌లో పెట్టేస్తున్నాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు తన పెదనాన్న మరణంతో బయటకు రావాల్సి వచ్చింది.

what happened to prabhas..??

ఆదిపురుష్‌ టీజర్ లాంచ్ ఈవెంట్ కోసం అయోధ్యకు రావాల్సి వచ్చింది. అయితే ఈ ఈవెంట్లో ప్రభాస్ నడిచేందుకు కూడా చాలా కష్టపడ్డట్టు కనిపిస్తోంది. ప్రభాస్ తన టీంతో కలిసి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అటు పక్క డైరెక్టర్ ఓం రౌత్, ఇటు పక్కన కృతి సనన్ నడుస్తుండగా.. మధ్యలో ప్రభాస్ వారి సాయంతో నడిచాడు. ఇక మెట్లు దిగే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం కృతి సనన్‌ చేతిని తీసుకున్నాడు. ఓం రౌత్ భుజం మీద చేయి వేశాడు ప్రభాస్.

what happened to prabhas.
అలా ప్రభాస్ ఈ ఈవెంట్లో చాలా చోట్ల నిలబడటానికి కూడా ఇబ్బంది పడ్డాడు. కనీసం నిలబడలేకపోడం, మెట్లు కూడా దిగలేకపోవడం చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. మళ్లీ ఏదైనా ప్రాబ్లం అయిందా? ఇంకా సర్జరీ నాటి దెబ్బ తగ్గలేదా? ఇలా అయితే సలార్ వంటి యాక్షన్ సినిమాను ఎలా పూర్తి చేస్తాడు? అంటూ ఇలా అభిమానులు కంగారు పడుతున్నారు.

what happened to prabhas.
అంత పెయిన్ పెట్టుకుని షూటింగ్స్‌లో పాల్గొంటున్నార‌ని క్లియ‌ర్‌గా తెలిసిపోతుంది. నిజంగానే అంత ఇబ్బంది ప‌డుతూ ఎందుకు షూటింగ్ చేయాల‌ని సినీ స‌ర్కిల్స్‌లో కూడా అనుకుంటున్నారు. ఈ విషయం పై ప్రభాస్ ఫాన్స్ ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

what happened to prabhas.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. యూవీ క్రియేషన్స్ సంస్థ ఆది పురుష్ సినిమాను నిర్మిస్తోంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

what happened to prabhas.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ పూర్తైంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే.. ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయాల్సి ఉంది. అలాగే మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.