తెలుగు బుల్లితెరపై సందడి చేస్తూ.. ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న వారిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒకడు. కామెడీ, యాక్టింగ్, డ్యాన్స్, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నాడు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్.. సినిమాల్లో ఫ్రెండ్ కేరెక్టర్లు చేసుకుంటూ.. హీరోగా చేసే స్థాయికి ఎదిగారు.

Video Advertisement

సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. అయితే తాజాగా సుధీర్ హీరోగా నటించిన గాలోడు చిత్రం విడుదలైంది. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘గాలోడు’ మూవీపై సుడిగాలి సుధీర్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

sudheer fans fire on galodu movie..

అయితే ఈ చిత్రం యావరేజ్ టాక్ నే తెచ్చుకుంటుంది. సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రాన్ని తీసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్లనే దీనికి కూడా డైరెక్టర్. ఆ చిత్రం కూడా సో సో గానే ఉంటుంది. అయితే ఈ సినిమాలో సుధీర్ ఫాన్స్ కి నచ్చే ఎలివేషన్స్ ఉన్నా కథలో కంటెంట్ మిస్ అయ్యింది. దీంతో సుధీర్ ఫాన్స్ నిరాశకు గురయ్యారు.

sudheer fans fire on galodu movie..

తనదైన స్కిట్స్‌తో స్మాల్ స్క్రీన్ పై స్టార్ కమెడియన్‌గా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నాడ సుధీర్. అతడికి అభిమాన గణం కూడా ఎక్కువగానే ఉంది. అయితే టీవీ ల్లో ఇంత స్టార్ స్టేటస్, పాపులారిటీ ని వదిలి సుధీర్ సినిమాల్లోకి వెళ్లడం వరకు బానే ఉన్నా.. హీరోగా వరుస సినిమాలు చేస్తున్నా.. మంచి కథలు ఎంచుకోవడం లో తడబడుతున్నాడని ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా జబర్దస్త్ ని వీడి వెళ్లడం తో కూడా ఆయన అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. షో లో ఉన్నప్పుడే బావుండేదని.. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడు.. ఏంటి అనే విషయాలు కూడా తెలియట్లేదని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.