“సూర్య” కి ఏమయ్యింది..? ఇలా అయిపోయారేంటి..?

“సూర్య” కి ఏమయ్యింది..? ఇలా అయిపోయారేంటి..?

by kavitha

Ads

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్య తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.

Video Advertisement

సూర్య దర్శకుడు సిరుత్తే శివ తెరకెక్కిస్తున్న’కంగువ’ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ ఈ మూవీకి సంబంధించిన ఫోటోను రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫోటోలోని సూర్యను చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. సూర్య నటిస్తున్న ‘కంగువ’ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పీరియాడిక్ డ్రామాకా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దాదాపు 10 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్స్ లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ దిశా పఠానీ నటిస్తోంది. కంగువ షూటింగ్ విరామం రావడంతో సూర్య ప్రస్తుతం కొడైకెనాల్‌లో తన కుటుంబంతో కలిసి హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు ఆత్మీయస్వాగతం పలికిన సూర్య, జ్యోతిక దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ వారితో కలిసి తీసుకున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ ఫోటో సూర్య లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో గజిని చిత్రం సమయంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించిన సూర్య. మిగతా చిత్రాలలో రెగ్యులర్ లుక్‌లో నటించారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సూర్య కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే కంగువ మూవీ కోసం కోలీవుడ్ స్టార్ సూర్య బరువు పెరిగినట్లుగా తెలుస్తోంది. పీరియాడిక్ పోర్షన్ చిత్రీకరణ కొడైకెనాల్‌లో జరుగుతోంది. ఆగస్టు 2023నాటికి షూటింగ్ ను పూర్తిచేయాలని యూనిట్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది.ఇక ఈ చిత్రం హీరో సూర్య కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుటున్న మూవీ. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సహ నిర్మాత జ్ఞానవేల్ రాజా. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

Also Read: 30 ఏళ్ళ తరువాత ఆ వ్యక్తిని కలిసిన “అల్లు అర్జున్”.. చూడగానే కాళ్ళకు నమస్కారం ..! ఆమె ఎవరంటే..!

 


End of Article

You may also like