‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల ముద్దుగుమ్మ తాప్సీ. ఆ తర్వాత కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించింది తాప్సీ.. కానీ టాలీవుడ్ లో అనుకున్నంత సక్సెస్ రాకపోవడం తో బాలీవుడ్‌కి వెళ్లింది. అక్క‌డ మ‌హిళా ప్రాధాన్య‌త చిత్రాలు చేయ‌డంతో టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా మారింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.

Video Advertisement

 

ఇక సౌత్ లో కూడా తాప్సి అడపా దడపా పలు చిత్రాలు చేస్తూ అలరిస్తోంది. అలాగే ఆమె తన కెరీర్ లో పలు వివాదాల్లో కూడా చిక్కుకుంది. తాప్సి అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్స్ కాంట్రవర్సీ గా మారిపోతున్నాయి. ఇక తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ మరో రేంజ్ కు వెళ్ళింది. తెలుగులో కంటే హిందీలోనే ఈమెకు సక్సెస్ రేటు ఎక్కువ.

heroine tapsee six pack look..!!

హిందీ లో పింక్, బాద్లా, సాండ్ కీ ఆంఖ్, తప్పడ్, గేమ్ ఓవర్ వంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. అయితే బాలీవుడ్ లో ఎంటర్ అయిన దగ్గరనుండి తాప్సీ డీ గ్లామర్ రొల్స్ , కంటెంట్ ఓరియెంటెడ్ రోల్స్ లోనే నటించారు. ఇప్పటి నుండీ గ్లామర్ గేమ్ ఆడతానని తాప్సీ ఇటీవల స్టేట్ మెంట్ ఇచ్చారు. దానికి తగ్గట్టే ఆమె ఫోటోషూట్స్ కూడా ఉంటున్నాయి.

heroine tapsee six pack look..!!

ఇక తాజాగా తాప్సి లేటెస్ట్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఏకంగా సిక్స్ ప్యాక్ లుక్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. తన జిమ్ ట్రైనర్ తో తాప్సి ఇచ్చిన ఫోజులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాప్సి లేటెస్ట్ లుక్ చూసి ఆమె ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఈ ఫోటో లో తాప్సి తన సిక్స్ ప్యాక్ యాబ్స్ చూపిస్తోంది. గ్లామర్ గా కనిపించే తాస్పి ఇలా సిక్స్ ప్యాక్స్ తో కనిపించడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

heroine tapsee six pack look..!!

” నెలల కష్టం, చెమటలు చిందించడం వల్లే ఇది సాధ్యం అయింది. కాబట్టి మేమిద్దరం చాయ్ బిస్కెట్ షేర్ చేసుకుంటున్నాం..” అంటూ తాప్సి ఈ ఫోటో కి కామెంట్ పెట్టింది. ప్రస్తుతం తాప్సి రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్ ల చిత్రంలో నటిస్తోంది. అలాగే మరో ప్రాజెక్టుకి కూడా ఆమె సైన్ చేసింది. ఈ తాజా చిత్రం కోసం ఈ లుక్ లోకి మారిందా అని ఆమె ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.