సినీ పరిశ్రమ ఎప్పటికప్పుడు టాలెంట్ ఉన్నవారిని అందలం ఎక్కిస్తూనే ఉంటుంది. కెరీర్ మొదట్లో ఎన్నో ప్లాప్స్ వచ్చిన వాళ్ళను కూడా స్టార్ నటులను చేస్తుంది. దానికి వారికీ కావాల్సింది మంచి బ్రేక్ ఇచ్చే సినిమా. అటువంటి సినిమాలను, బ్రేక్ ఇచ్చిన వాళ్ళను ఎప్పటికి మర్చిపోరు . కానీ ప్రస్తుతం కొందరు హీరోయిన్లు తమకు బ్రేక్ ఇచ్చిన వాళ్ళని అవమానిస్తున్నట్లు మాట్లాడటం కామన్ అయిపోయింది.

Video Advertisement

ఇటీవల రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆమె ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. పుష్ప తర్వాత బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది రష్మిక. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక, తాను ఎలా సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశించిందో చెప్పింది. అయితే ఇక్కడ ఆమె కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి కానీ, కిరిక్ పార్టీ హీరో హీరో రక్షిత్ శెట్టి గురించి కానీ మాట్లాడకుండా.. అప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు కాల్ వచ్చింది అని అంటూ రెండు చేతులు పైకి ఎత్తి ఫింగర్స్ క్రాస్ చేసి ఓ రకమైన సైగలతో ఆమె చెప్పుకొచ్చింది.

rashmika mandanna gets strong reaction from rishab shetty..

అయితే ఆమె కెరీర్ బిల్డ్ అవ్వడానికి అంత సూపర్ హిట్ ఇచ్చిన రిషబ్ శెట్టి పేరును పలకడానికి రష్మిక మందన్న ఇష్టపడలేదనేది వీడియోలో స్పష్టంగా కనిపించింది.

rashmika mandanna gets strong reaction from rishab shetty..

ఇలాగే ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న పూజ హెగ్డే కూడా గతం లో ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. కెరీర్ మొదట్లో ప్లాప్ లతో సతమతమైన పూజ.. తర్వాత స్టార్ హీరోయిన్ అయ్యింది. కానీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..దక్షిణాది ప్రేక్షకులపై నోరు పారేసుకుంది. ఇక్కడ ప్రేక్షకులకు నాభి, నడుము, తొడలు అంటే బాగా ఇష్టపడతారని… అల వైకుంఠపురములో కాళ్లను హైలట్ చేసి చూపించడం కూడా దీనిలో భాగమే అని అన్నారు.

netizens shocked by the behaviour of star heroines..

దీంతో ప్రస్తుతం హీరోయిన్ల ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు బ్రేక్ ఇచ్చి, స్టార్స్ ని చేసిన వాళ్లనే.. స్టార్డం రాగానే అవమానించేలా మాట్లాడుతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి ప్రవర్తన వారికి ఎప్పటికీ మంచిది కాదు అని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

watch video :