జయసుధ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది మన ఇంట్లో అమ్మ లాగానో, పిన్ని లాగానో, లేదంటే అమ్మమ్మ లాగానో కనిపించే నిండైన రూపం. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లి గా, నానమ్మ గా కూడా పాత్రలు పోషించి కుటుంబ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. ఆమెకు చాలా మంది అభిమానులే ఉన్నారు తప్ప హేటర్స్ ఎవరు లేని నటి గా ఆమె పేరు ప్రఖ్యాతలు గడించారు.

jayasudha

కానీ లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూస్తే.. ఈమె మన జయసుధేనా? అనిపించక మానదు. గతం లో కూడా ఆమె ఓ వీడియో షేర్ చేశారు. “జానకి కల గనలేదు” అనే సీరియల్ గురించి మాట్లాడుతూ ఆమె షేర్ చేసిన వీడియో లో జయసుధ ఫేస్ చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోయారు. ఆమె బాగా చిక్కిపోయి, జుట్టు నెరిసిపోయి కనిపించారు.. తాజాగా ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ అయిన పై ఫోటో కూడా అలానే ఉంది. ఆమె ప్రస్తుతం అమెరికా లో ఉన్నారు. భర్త నితిన్ కపూర్ మరణించాక ఆమెకు సినిమాలపై ఆసక్తి కూడా తగ్గిందనే చెప్పాలి. ఆమె లేటెస్ట్ ఫోటోలలో ఆమె అలా కనిపిస్తుండడం తో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.