Ads
సాధారణంగా మనిషికి మెదడు ఉన్నది ఆలోచించడానికే. అందుకే అప్పుడప్పుడు వింత వింత ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందరికీ కాకపోయినా కొంతమందికైనా సమాధానం లేని ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. మీలో కనీసం ఒక్కరికైనా ఈ ప్రశ్న కచ్చితంగా ఆలోచించి ఉంటారు. అదేంటంటే ఇప్పుడు ఒకవేళ ట్రైన్, ఏరోప్లేన్ లాంటివి నడుపుతున్నప్పుడు లోకో పైలట్ లేదా పైలెట్ కి నిద్ర రాదా? అని.
Video Advertisement
అంటే మామూలుగా బస్, ఆటో లాంటి వాహనాల్లో అయితే డ్రైవర్లు మనకి కనిపిస్తుంటారు. కానీ ట్రైన్, ఇంకా ఫ్లైట్ లో కనిపించరు కదా? ముఖ్యంగా ట్రైన్ లో అయితే బోగీ లు ఉంటాయి కాబట్టి ఒకవేళ మనం కొంచెం దూరంగా ఉన్న బోగీలో ఉంటే అప్పుడు లోకో పైలట్ మనకి ఇంకా దూరంగా ఉంటారు. ఇంక ప్రశ్న విషయానికొస్తే ఒకవేళ ట్రైను నడిపే లోకో పైలట్ కి నిజంగానే నిద్ర వస్తే ఏమౌతుంది? అనే ప్రశ్నకు జవాబు ఉంది. అదేంటంటే.
లోకో లో ఒక విజిలెన్స్ డివైస్ ఏర్పాటు చేసి ఉంటుంది. లోకో పైలట్ లేదా అసిస్టెంట్ లోకో పైలట్ పుష్ బటన్ ని నిమిషానికి ఒకసారి ప్రెస్ చేయాలట. విజిలెన్స్ డివైస్ ని ఎక్నాలెడ్జ్ చేయడానికి ఇలా నిమిషానికి ఒకసారి బటన్ ప్రెస్ చేస్తారట. ఒకవేళ లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏదైనా వేరే పని (స్విచ్ ఆపరేట్ చేయడం,హారన్ వేయడం, బ్రేక్ అప్లై చేయడం) లో బిజీగా ఉంటే, అప్పుడు పుష్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదట. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ పనిచేస్తున్నప్పుడు విజిలెన్స్ డివైస్ దానంతట అదే ఎక్నాలెడ్జ్ అవుతుందట.
ఒకవేళ లోకో పైలట్ ఇంకా అసిస్టెంట్ లోకో పైలట్ ఏదో ఒక కారణం వలన ఎటువంటి పని చేయకపోతే, అంతేకాకుండా పుష్ బటన్ స్విచ్ (BPVG) కూడా ప్రెస్ చేయకపోతే, ఎనిమిది సెకండ్ల వరకు ఒక లాంప్ వెలుగుతుందట. కొన్నిసార్లు లోకో పైలట్ ఏదైనా ఆరోగ్య సమస్యల వలన అపస్మారక స్థితిలో ఉంటే, లాంప్ వెలిగినప్పుడు వచ్చే హెచ్చరికకి కూడా స్పందించలేకపోతుంటే, అప్పుడు ఎమర్జెన్సీ బ్రేక్ వాటంతటవే అప్లై అయ్యి, ట్రైన్ ఆగుతుందట.
End of Article