“వీలునామా” రాయకుండా ఒక వ్యక్తి చనిపోతే…అతని “ఆస్తి” ఎవరికి చెందుతుంది.?

“వీలునామా” రాయకుండా ఒక వ్యక్తి చనిపోతే…అతని “ఆస్తి” ఎవరికి చెందుతుంది.?

by Mohana Priya

Ads

Article sourced from: a youtube video from channel “Suman Tv Legal”

Video Advertisement

సాధారణంగా చాలా కుటుంబాల్లో జరిగే గొడవలు ఆస్తికి సంబంధించిన గొడవలు ఒకటి. ఈ గొడవలు ఎన్నో రకాలు ఉంటాయి. చాలా తరచుగా మనం వీటి గురించి వింటూనే ఉంటాం. తోబుట్టువులు ఉంటే ఆస్తి వారికి రావాలి అని అనుకోవడం, లేదా ఆస్తి పత్రాల విషయంలో స్పష్టత లేకపోవడం, ఇలా ఎన్నో రకాల గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాగే ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే తర్వాత ఆస్తి ఎవరికి చెందుతుంది అనే గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే ఆస్తి ఎవరికి చెందుతుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rights of married daughter in father's property

హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక కుటుంబంలో ప్రథమ శ్రేణి వారసులు, ద్వితీయ శ్రేణి వారసులు అని ఉంటారు. చనిపోయిన వ్యక్తికి ముందు తల్లి ఉన్నారా లేదా అని చూస్తారు. తర్వాత భార్య, కొడుకు, కూతురు ఉన్నారేమో అని చూస్తారు. వీళ్ళందరూ ప్రథమ శ్రేణి వారసుల కిందకి వస్తారు. ఒకవేళ కొడుకు చనిపోతే ఆ చనిపోయిన కొడుకు యొక్క సంతానం, కూతురు చనిపోయి ఉంటే కూతురు యొక్క సంతానం కూడా ప్రథమ శ్రేణి వారసుల కిందకే వస్తారు. వీళ్ళకి ఆస్తి సమానంగా డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది.Does second wife have rights on husband's property

ద్వితీయ శ్రేణి వారసులు అంటే ఒకవేళ ఆ వ్యక్తికి సంతానం లేకపోతే, మనవళ్లు, మనవరాళ్లు వచ్చే అవకాశం ఉండదు. వాళ్లు కూడా లేరు అని భావించినప్పుడు భర్త చనిపోతే భార్య జీవించి ఉంటారు. లేదా భార్య భర్త జీవించి ఉంటారు. ఆ కుటుంబంలో ఇంక ఎవరూ లేని పక్షంలో జీవించి ఉన్న వ్యక్తుల గురించి చూసినప్పుడు ముందుగా పురుషుడి తరుపు చుట్టాలని చూస్తారు. ఒకవేళ పురుషుడికి తోబుట్టువులు ఎవరు లేకపోతే మహిళ యొక్క తోబుట్టువులు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తారు. వారికి ప్రాముఖ్యతను ఇస్తారు.What if a person passes away without writing will

సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉండదు. సంతానం లేకపోయినా కూడా ఒకవేళ పెంచుకున్న పిల్లలు కానీ, లేకపోతే భార్య పోతే భర్త, భర్త పోతే భార్య ఉండొచ్చు. ఒకవేళ ఆ వ్యక్తికి గనక రెండు పెళ్లిళ్లు అయ్యుంటే, రెండవ కుటుంబానికి చెందిన వారికి ఆస్తిపై హక్కు ఉండదు. హిందూ వివాహ చట్టం 1955 లో వచ్చింది. అంతకుముందు బహుభార్యత్వం ఉండేది.  1955 కి ముందు వివాహం అయ్యుంటే, చనిపోయే సమయానికి ఆయనకు ఇద్దరు భార్యలు ఉంటే, ఒక్క భార్య కిందే పరిగణించి ఆస్తిని ఒక్కరికే ఇచ్చేవారు. ఆ ఆస్తిని ఇద్దరు భార్యలు పంచుకుంటారు.What if a person passes away without writing will

1955 కి ముందు వివాహం అయితే రెండవ భార్య కూడా చట్టపరంగా భార్య కింద పరిగణించబడతారు. ఒకవేళ 1955 తర్వాత రెండవ పెళ్లి చేసుకుని, కుటుంబం ఉంటే మాత్రం రెండవ కుటుంబానికి చట్టపరమైన హక్కులు ఉండవు. కానీ చట్ట ప్రకారం అయితే మాత్రం వారి సంతానాన్ని కూడా ప్రథమ శ్రేణి వారసుల కిందట పరిగణిస్తారు. చట్టపరంగా ఇంకొక విషయం కూడా చెప్పారు. అది ఏంటంటే చనిపోయిన వ్యక్తి రెండవ భార్యకి ఆ వ్యక్తి స్వార్జితంలో మాత్రమే వాటా ఉంటుంది. తరతరాలుగా వస్తున్న ఆస్తిలో వాటా ఉండదు. ఈ విషయంపై ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

watch video :


End of Article

You may also like