సెలెబ్రిటీలు ఆరోగ్యానికి, ఫిట్ నెస్ కి ఎంతో ప్రాముఖ్యత ను ఇస్తూ ఉంటారు. డైట్ విషయం లో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఆఖరుకు వారు తాగే మంచి నీటి విషయం లో కూడా కేర్ తీసుకుంటారు అనడం లో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు మినరల్ వాటర్ కు బాగా డిమాండ్ ఉండేది. కానీ ఈ మధ్య కాలం మినరల్ వాటర్ లో శరీరానికి అవసరమైన మినరల్స్ లభించవు అని నిపుణులు చెప్తూ ఉండడం తో సెలెబ్రిటీలు తమ రూట్ ను మారుస్తున్నారు.

ఖరీదైన వాటర్ ను సైతం కొనుక్కుని తాగుతున్నారు. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం బ్లాక్ వాటర్ నే తాగుతున్నారు. ఈ వాటర్ ను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేస్తున్నారట. పేరుకు తగ్గట్లే ఈ వాటర్ చూడడానికి నల్లగా ఉంటుంది. మినరల్ వాటర్ బాటిల్ లీటర్ 30 రూపాయలకు వచ్చేస్తుంది. కానీ.. ఈ బ్లాక్ వాటర్ బాటిల్ లీటర్ ధర మూడు నుంచి నాలుగు వేల వరకు ఉంటుంది.

ఈ వాటర్ లో ఉండే నాచురల్ ఆల్కలైన్ శరీరాన్ని హైడ్రేట్డ్ గా ఉంచడం తో ఫిట్ గాను ఉంచుతుందట. జీర్ణ, రోగ నిరోధక వ్యవస్థలు కూడా మెరుగుపడతాయట. ఈ వాటర్ లో ఉండే మినరల్స్ వలన శరీరం వయసు మీరకుండా ఉంటుందట.