మామూలుగా పూజ చేసినప్పుడు మంత్రాలు చదువుతారు. పెళ్ళిళ్ళు మొదలైన శుభకార్యాలకు కూడా మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇవే మంత్రాలని మనం అనుకుంటాం. కానీ మంత్రానికి అర్ధం వేరు. మంత్రం వలన కలిగే లాభం కూడా వుంది.

Video Advertisement

చాలా మందికి ఇటువంటి వాటి గురించి తెలీదు. అయితే మంత్రాల కి మెదడు కి ఉన్న సంబంధం ఏమిటి అనే ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు మంత్రం అనేది సంస్కృత పదం. ‘మన్’ అంటే మనస్సు అలానే ‘త్ర’ అంటే సాధనం. అంటే దీని అర్ధం మనసును నియంత్రించే సాధనం అని. మన ఆలోచనలను కంట్రోల్ చేసేది. అయితే మంత్రం లో అత్యంత ముఖ్యమైనది ధ్వని. ధ్వని అంటే మన నోటి నుండి వచ్చే శబ్దం.

అది మాటైనా పాటైనా సరే. అలానే మంత్రాలను వల్లివేస్తే మైండ్ లో అటెన్షన్ నెట్‌ వర్క్ యాక్టివేట్ అవుతుంది. డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్ కూడా స్లో గా డీయాక్టివేట్ అవుతుంది. ఒక స్వామిజీ యొక్క మెదడు ని చూసి ఫలితాలను చెప్పారు. మంత్రాలు వలన మైండ్ లో అటెన్షనల్, వర్కింగ్ మెమోరీ పార్ట్స్ లో ఇంప్రూవ్మెంట్ కలిగింది. అదే విధానగా మంత్రాలు జపిస్తున్నప్పుడు నిశ్చలంగా ప్రశాంతంగా మన మనస్సు వుంటుందట.

మనల్ని తీర్చిదిద్దడానికి మన ఆలోచనలు బాగా ఉపయోగ పడతాయి. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఆలోచన చేతిలో ఉంటుంది. పైగా మనల్ని ఎన్నో కోరికలు, ఆశలు కట్టిపడేస్తూ ఉంటాయి. మన అవసరాలతో మనం జీవితాంతం నిద్రపోతూ ఉంటాం. కోరికలు నెరవేరక పోతే ఏదో తెలియని బాధ కలుగుతుంది కోపం వస్తుంది.

అయితే మన ఆలోచనలే మనల్ని మార్చేస్తాయి. మన ఆలోచనలు మనల్ని తయారు చేస్తాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆలోచనలు మీద ఏకాగ్రత పెడుతూ ఉండాలి. మన ఆలోచనల బట్టే మనం తయారవుతాము. మన ఆలోచన బాగుంటే మన యొక్క జీవితం కూడా బాగుంటుంది.