“భారతరత్న” అవార్డ్ గ్రహీతలకి ఏం ఇస్తారు..? అసలు ఈ అవార్డ్ ఎవరికి ఇస్తారు అంటే..?

“భారతరత్న” అవార్డ్ గ్రహీతలకి ఏం ఇస్తారు..? అసలు ఈ అవార్డ్ ఎవరికి ఇస్తారు అంటే..?

by kavitha

కేంద్ర ప్రభుత్వం తాజాగా రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కె అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం “భారతరత్న” ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం విశేషం.

Video Advertisement

ఈ నేపథ్యంలో అద్వానీకి రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో అద్వానీ గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. మరో వైపు భారతరత్న అవార్డు ఎవరికి ఇస్తారు? ఏం ఇస్తారనే విషయం కూడా వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
భారతరత్న పురస్కారాన్ని  దేశంలో ఏదైనా రంగంలో అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారంను 1954లో జనవరి 2న దేశ తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ మొదలుపెట్టారు. ఈ అవార్డ్ ను ఇప్పటివరకు 49 మంది అందుకోగా, వారిలో శాస్త్రవేత్తలు, మేధావులు, రచయితలు, సాహిత్యకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు తదితరులు ఉన్నారు. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. భారతరత్న ప్రారంభించిన తరువాత సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తి రాజగోపాలాచారి, ప్రముఖ శాస్త్రవేత్త, డాక్టర్‌ సివి రామన్‌ 1954లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

1955 నుండి భారతరత్న పురస్కారాన్ని మరణానంతరం కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ అవార్డుల సెలెక్షన్ ప్రాసెస్ పద్మ అవార్డుల కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రధానమంత్రి నేరుగా ఈ అవార్డుల కోసం వ్యక్తుల పేర్లను  రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. వృత్తి, కులం, జెండర్ అనే ఎలాంటి డిఫరెన్స్ లేకుండా ఎవరి పేరును అయినా భారతరత్న అవార్డ్ కు పరిశీలించొచ్చు. ఒక సంవత్సరంలో గరిష్టంగా ముగ్గురికి భారతరత్న అందిస్తారు. అలా అని ప్రతి ఏడాది ఈ అవార్డు తప్పనిసరిగా ఇవ్వాలనే రూల్ లేదు.  ఈ అవార్డు విజేతలను రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి సత్కరిస్తారు.
భారతరత్న అవార్డ్ అందుకున్నవారికి రాష్ట్రపతి సంతకంతో ఉన్న ధ్రువీకరణ పత్రం మరియు  మెడల్ అందచేస్తారు. ఈ మెడల్ రావి ఆకు రూపంలో ఉంటుంది. దీనిపై ప్రకాశిస్తున్న సూర్యుడు, భారతరత్న అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. మెడల్ వెనుక భగంలో జాతీయ చిహ్నం, దాని కింద సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. ఇక ఈ అవార్డ్ అందుకున్న వారికి నగదు ప్రోత్సాహకం ఉండదు. అయితే ప్రత్యేకమైన ప్రాధాన్యత మరియు సదుపాయాలు లభిస్తాయి. 2024లో ఎల్‌కే అద్వానీ మరియు కర్పూరి ఠాకుర్ లకు భారత రత్నఅవార్డ్  ప్రకటించారు. వీరితో ఇప్పటి వరకు ఈ అవార్డులు వచ్చిన వారి సంఖ్య యాబైకి చేరింది.

Also Read: అయోధ్య, జ్ఞానవాపి వెనుక ములాయం సింగ్ యాదవ్ పాత్ర ఏంటి..?

 


You may also like

Leave a Comment