Ads
సినిమాలు, సీరియల్స్ తో పాటు ప్రేక్షకులని అంత బాగా ఎంటర్టైన్ చేసేవి టీవీ షోస్. ఈ టీవీ షోస్ లో ఎన్నో రకాలు ఉంటాయి. ప్రతి ఛానల్ వారి స్టైల్ లో ఈ షోస్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తూ ఉంటారు. ఇటీవల కామెడీ షోస్ కి చాలా ఎక్కువగా డిమాండ్ పెరిగిపోయింది.
Video Advertisement
ప్రతి ఛానల్ లో ఒక కామెడీ షో వస్తోంది. అంతకుముందు గేమ్ షోస్ కి ఎక్కువ ఆదరణ ఉండేది. ఇప్పుడు కామెడీ షోస్ కి కూడా అదే రకంగా ఆదరణ వస్తోంది. అయితే సింగింగ్, డాన్స్ షోస్ మాత్రం ఎవర్ గ్రీన్ అనే విభాగంలోకి చెందుతాయి.
ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి ఈ రెండు విభాగాలకు చెందిన షోస్ వస్తూనే ఉన్నాయి. వస్తూ ఉంటాయి కూడా. వీటి ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలాంటి షోస్ అంటే చాలా మందికి ఇష్టంతో పాటు, కొంత గౌరవం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ గౌరవం పోతోంది. దానికి కారణం టీవీ షోస్ డిజైన్ చేస్తున్న విధానం. కామెడీ షోస్ కి డిమాండ్ బాగానే ఉంది. అక్కడి వరకు బానే ఉంది.
కానీ ప్రతి షోలో కామెడీ పెట్టాల్సిన అవసరం ఏముంది. కామెడీ కోసం కామెడీ షోస్ ఉన్నాయి. అలానే సింగింగ్ కోసం సింగింగ్ షోస్, డాన్స్ కోసం డాన్స్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు కదా. ఇటీవల వస్తున్న కొన్ని షోస్ లో పాటలు రచయితలు, గాయకులు కూడా జడ్జిలుగా పాల్గొంటున్నారు. వారు తమకి ఇచ్చిన జడ్జిమెంట్ అనే పని చేయడం మాత్రమే కాకుండా, కామెడీ కూడా చేస్తున్నారు. అనంత శ్రీరామ్ ఎంతో మంచి పాటల రచయిత. అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించినప్పుడు ఆయన ఇచ్చే జడ్జిమెంట్ కూడా చాలా బాగుంటుంది.
కానీ ఆయనతో కామెడీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు దాని అవసరం ఏముంది? అంతే కాకుండా ఈటీవీ ఢీ షో లో అయితే కమెడియన్స్ ని పెట్టి మరి కామెడీ చేయిస్తున్నారు. అంతకుముందు ఇలాంటివి ఉండేవి కాదు. ఆ షో కేవలం డాన్స్ కి మాత్రమే పాపులర్ అయ్యేది. ఇప్పుడు కింద కామెంట్స్ లో సగం మంది డాన్స్ గురించి కామెంట్స్ చేయడం మాని, “హైపర్ ఆది కామెడీ సూపర్. సుడిగాలి సుధీర్ కోసం ఎంత మంది చూస్తున్నారు?” అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
సగం కాదు. దాదాపు మొత్తం కామెంట్స్ వీళ్ళ గురించి ఉంటాయి. వీళ్ళ కోసం జబర్దస్త్ అనే ఒక షో ఉంది కదా? సరే ఈ షోలో వాళ్ళని తీసుకొచ్చి కామెడీ చేయించాల్సిన అవసరం ఏంటి? అసలు ఇక్కడ తప్పు ఎవరిది? సాధారణంగా ఈ ప్రోగ్రామ్స్ రూపొందించే వారు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే చేస్తారు. దీని ప్రకారం చూస్తే ప్రేక్షకులకు ప్రతి దాంట్లో కామెడీ కావాల్సి వస్తుందా? అది కూడా నవ్వు రాని కామెడీ. ఇక్కడ తప్పు అయితే మనదేనా? ఇలాగే చూస్తూ ఉంటే కొన్నాళ్ళు ఆగితే వంట షోలో కూడా కామెడీ పెడతారు ఏమో.
watch video :
ALSO READ : “ఆదిపురుష్” సినిమాతో పాటు… ఈ 2023 లో వచ్చిన 9 “చెత్త” సినిమాలు..!
End of Article