సోషల్ మీడియా అనేది ఇప్పటి జనరేషన్ కి ఎంత పెద్ద ప్లస్ అయ్యిందో అంతే పెద్ద మైనస్ కూడా అయ్యింది. అది కూడా ముఖ్యంగా సినిమా ప్రేమికులకి అయితే సోషల్ మీడియా ఓపెన్ చేయాలి అంటేనే చిరాకు వస్తుంది.

Video Advertisement

అందుకు కారణం సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్న ఫ్యాన్ వార్స్. సాధారణంగా సినిమా హీరోలకి అభిమానులు ఉంటారు. అప్పటి కాలంలో హీరోలకి కూడా ఇంతే మంది అభిమానులు ఉండేవారు. అయితే అప్పట్లో సోషల్ మీడియా ఇలా లేదు కాబట్టి ఇలాంటి తిట్టుకోవడం ఉండేది కాదు.

quoran answer about prashanth neel working with telugu heroes

బయట ఎదురు పడితే, “మా హీరో గొప్ప” అంటే, “మా హీరో గొప్ప” అని మాట్లాడుకోవడం మాత్రమే ఉండేది. ఇప్పుడు ముఖాలు కనిపించకుండా తమ హీరోల ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకొని వేరే హీరోలని తిట్టడం అనేది కామన్ అయిపోయింది. అది ఎంత వరకు వెళ్ళింది అంటే, ఆ హీరో కుటుంబాన్ని కూడా కలిపి తిట్టడం, అందులోనూ వాడకూడని పదాలు వాడడం అనేది చాలా అతిగా అయిపోయింది.

disappointed looks of tollywood heroes

“ఎందుకు ఇలాంటి కామెంట్స్? ఆపేసేయండి” అని ఎవరైనా ఒక కామెంట్ చేస్తే, దానికి ఆ హీరో ఫ్యాన్, “ముందు మొదలు పెట్టింది మీ హీరో ఫ్యాన్స్. కాబట్టి ముందు మీరే ఆపాలి.” అని అంటారు. వాళ్లని అడిగితే వాళ్లు కూడా ఇలాంటి సమాధానాలు చెప్తారు. అసలు ఇది ముందు మొదలు పెట్టింది ఎవరు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. హీరోలకి పేర్లు ఉంటాయి, ఆ పేర్లకి మెగాస్టార్, సూపర్ స్టార్, యంగ్ టైగర్, రెబల్ స్టార్, ఐకాన్ స్టార్, పవర్ స్టార్ అని ట్యాగ్స్ కూడా ఉంటాయి.

disappointed looks of tollywood heroes

కానీ ఇవన్నీ వదిలేసి ఆ హీరోలకి చాలా చండాలమైన పేర్లు పెట్టి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా ఆ హీరోని ట్యాగ్ చేసి బూతులు తిడతారు. ఆ హీరో ఏదో వీళ్ళకి చాలా క్లోజ్ అయినట్టు, లేదా ఏదో వీరి దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొట్టినట్టు, “అరేయ్, ఏరా” అని పదాలు పెట్టి మరీ తిడతారు. ఇది ఏదో చిన్న చిన్న హీరోలకి ఎదురయ్యే సమస్యలు అనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ స్థాయిలో ఉన్న హీరోలకి సోషల్ మీడియాలో ఇచ్చే మర్యాద ఇది. అందరూ ఇలా ఉండరు.

కానీ తాము ఫలానా హీరో అభిమానులం, వీరాభిమానులం అని చెప్పుకునే చాలా మంది సోషల్ మీడియా యూజర్స్ మరొక హీరోని తిడుతూనే ఉంటారు. “మీ హీరోకి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలకవు” అని ఒకళ్ళు అంటే, “ఆ డైరెక్టర్ లేకపోతే మీ హీరోకి ఇప్పుడు ఈ స్టార్ డం వచ్చేది కాదు. అందుకే ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి” అని మరొకరు అంటారు. “మీ హీరో కలెక్షన్స్ ఫేక్” అని ఒకళ్ళు అంటే, “మీ హీరోని సినిమాలో గ్రాఫిక్స్ చేసి చూపించారు” అని ఇంకొకళ్ళు అంటారు. ముఖాలకి మార్ఫింగ్ చేసి మీమ్స్ వేస్తారు. వీడియోలు చేస్తారు.

trolls on thaman about mahesh gunturu karam mass strike music..!!

సాధారణంగా బయట మాట్లాడడానికి కష్టం అయిన ఇబ్బందికరమైన తిట్లని, అసలు పలకాలంటే కూడా చిరాకు వచ్చే పదాలని కూడా ఆ హీరోలని అంటారు. నిజంగా ఒక హీరో సినిమా బాగా లేకపోతే అది చెప్పే విధంగా చెప్తే బాగానే ఉంటుంది. కానీ ఇంత ఘోరంగా తిట్లు పడేంత పనులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫ్లాప్ అవ్వనివ్వండి, హిట్ అవ్వనివ్వండి, ప్రతి హీరో ఒక సినిమా కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడతాడు. ఈ తిట్లు పడుతున్న స్టార్ హీరోలు అందరూ ఊరికే స్టార్ హీరోలు అవ్వలేదు కదా? వాళ్లలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది కాబట్టే ఇక్కడి వరకు రాగలిగారు. ఇంకా ముందుకి కూడా వెళ్తారు.

Prabhas-Project-K-First-Look

హీరోలు అందరూ వేరే హీరోకి అవార్డు వచ్చినప్పుడు కానీ, లేదా వాళ్ళ పుట్టిన రోజు అయినప్పుడు కానీ వారికి విష్ చేస్తూ సోషల్ మీడియా ద్వారానే పోస్ట్ చేస్తారు. ఈ ఫ్యాన్ వార్స్ ఆపడానికి, వాళ్లు వాళ్లు బాగానే ఉన్నారు అని మనకి చెప్పడానికి ఇది వారి వంతు ప్రయత్నం. కానీ అలా చేసినా కూడా, “మీ హీరోకి ఇప్పుడు సినిమాలు లేవు. కాబట్టి మా హీరోని పొగుడుతూ కాకా పడుతున్నాడు” అని అంటారు. అంతే కాకుండా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మరొక స్టార్ హీరోని పిలుస్తున్నారు.

వాళ్లకి ఈగోలు లేవు అని, వాళ్ల మధ్య కాంపిటీషన్ ఉన్నా కూడా అది చాలా ఆరోగ్యకరమైన కాంపిటీషన్ అని, వాళ్లు చాలా స్నేహంగా ఉంటారు అని చెప్పడానికి మన హీరోలు ఇంత ప్రయత్నం చేస్తుంటే మనం మాత్రం అర్థం చేసుకోకుండా ఇంకొక హీరోని కించపరుస్తూ మాట్లాడి మన హీరోని గొప్ప అనుకుంటున్నాం. వారు ఇంత చేస్తున్నా కూడా వాళ్లు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోవట్లేదు అంటే, వాళ్ళు చేసే మంచిలో కూడా చెడునే వెతుకుతున్నారు అంటే లోపం ఎవరిలో ఉంది.

ALSO READ : అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీలో “ఫోటోగ్రాఫర్” గా నటించిన ఈ నటుడు ఎవరో తెలుసా..?