టెలికాం దిగ్గజం అయిన BSNL ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి..? ఇలా చేసి ఉండకపోతే..?

టెలికాం దిగ్గజం అయిన BSNL ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి..? ఇలా చేసి ఉండకపోతే..?

by Mohana Priya

Ads

ఒకరి నుంచి ఒకరికి సందేశాన్ని మాటలు చేరుస్తూ దూరంగా ఉన్న మనుషులను దగ్గరగా చేస్తూ విశేష ప్రజాదరణ పొందిన టెలికాం సంస్థ 2000 నుంచి 2010 మధ్య సమయంలో ఎన్నో కఠినమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది. 2000 సంవత్సరం ప్రారంభంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. అదేనండి మన బిఎస్ఎన్ఎల్ ప్రతి ఇంట తన సేవలను అందిస్తూ నెంబర్ వన్ సంస్థగా నిలిచింది.

Video Advertisement

అలాంటి సంస్థ 2009 -10 మధ్య ప్రాంతంలో మొదటిసారిగా నష్టాన్ని చవిచూసింది. ఆ తర్వాత క్రమంగా బిఎస్ఎన్ఎల్ ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చి ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ల్యాండ్ ఫోన్లు వెళ్లి హ్యాండ్ ఫోన్లు చేతికి వచ్చాయి.

what is reason behind bsnl failure

హచ్ ,వోడాఫోన్, ఐడియా, ,రిలయన్స్, ఎయిర్‌టెల్ ఇలా వరుసగా రంగంలోకి దిగిన ప్రైవేట్ సంస్థల ధాటికి బిఎస్ఎన్ఎల్ తట్టుకోలేకపోయింది. ఒకప్పుడు ప్రభుత్వానికి ఎంతో లాభాన్ని చేకూర్చిన సంస్థ ఈనాడు కనుమరుగయ్య స్థితికి రావడానికి టెక్నాలజీ ప్రధాన కారణం అయితే తట్టుకోలేని పోటీ మరొక కారణం. 2003 ఆర్థిక సంవత్సరంలో ₹1,444 కోట్ల లాభాన్ని తెచ్చి రికార్డు స్థాయిలో నిలిచిన కంపెనీ 2021 నాటికి ₹40,000 కోట్ల రిలీఫ్ ఫండ్ ప్రభుత్వం నుంచి తీసుకునే స్థాయికి పడిపోయింది.

what is reason behind bsnl failure

బిఎస్ఎన్ఎల్ చార్జీలతో పోల్చుకుంటే జియో లాంటి నెట్వర్క్ ప్రజలకు ఎంతో తక్కువ రేట్ కి ఎక్కువ వసతులను కల్పిస్తున్నాయి. పైగా ఇంటర్నెట్ ప్యాకేజీ కూడా బిఎస్ఎన్ఎల్ తో పోలిస్తే మిగిలిన అన్ని ప్రైవేట్ నెట్వర్క్ చాలా తక్కువ రేట్ కి అందిస్తున్నాయి. కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ప్రైవేట్ వాళ్ళు ఇస్తున్న ధరకి అందివ్వడం కుదరదు. ముఖేష్ అంబానీ నేతృత్వంలో ప్రారంభమైన రిలయన్స్ టెలికాం ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టుకుంది. జియో విస్తరిస్తున్న కొద్ది బిఎస్ఎన్ఎల్ క్రమంగా మరుగున పడుతుంది.

what is reason behind bsnl failure

జియో కారణంగా ఇప్పటికే ఎన్నో చిన్న నెట్వర్క్ ప్రొవైడర్లు కనుమరుగైపోయాయి. కొందరు కోల్పోలేని నష్టాలలో కూరుకుపోయారు.. వోడాఫోన్ మరియు ఐడియా లాంటి సంస్థలు కూడా నష్టాలను భరించలేక విలీనం అయ్యాయి. ప్రస్తుతం ఉన్న అన్ని నెట్వర్క్ కంపెనీలో ఎయిర్‌టెల్ కాస్త పోటీని నిలదొక్కుకొని ఉంది అని చెప్పవచ్చు. కానీ మార్కెట్లో జియో మరియు రిలయన్స్ కి మాత్రం పోటీగా నిలబడడానికి ఎవరికీ సత్తా సరిపోదు.

ALSO READ : ధోని తర్వాత CSK కెప్టెన్ అతనేనా..? “అంబటి రాయుడు” చెప్పిన పేరు ఎవరు అంటే..?


End of Article

You may also like