“లాయర్” కి “అడ్వకేట్” కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా.? ఇద్దరు ఒకరే అనుకుంటే పొరపాటే.!

“లాయర్” కి “అడ్వకేట్” కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా.? ఇద్దరు ఒకరే అనుకుంటే పొరపాటే.!

by Mohana Priya

Ads

Article sourced from: Byjus
కొన్ని పదాలు చూస్తే అర్థం ఒకటే ఏమో అనిపిస్తుంది. కానీ ఆ పదాలకి మధ్య అర్థంలో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అలా మనలో చాలా మందికి లాయర్, అడ్వకేట్ అనే పదాలకి మధ్య డిఫరెన్స్ తెలియకపోవచ్చు.

Video Advertisement

“వారిద్దరూ ఒక్కటే కదా?” అని అనుకుంటాం. కానీ లాయర్ కి, అడ్వకేట్ కి మధ్య తేడా ఉంది. బైజూస్ ప్రకారం అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Difference between lawyer and advocate

లా కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా (LLB) డిగ్రీ అందుకున్న వారిని లాయర్ అంటారు. భారతదేశంలో ఒక లాయర్ లేదా లా గ్రాడ్యుయేట్ న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే, వారు స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ చేసుకోవాలి. అలాగే ఆల్ ఇండియా బార్  ఎగ్జామినేషన్ (AIBE) కూడా క్లియర్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఒక అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. LLB డిగ్రీ ఉండి, బార్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినవారిని అడ్వకేట్ అంటారు.

Difference between lawyer and advocate

లాయర్లు కేవలం న్యాయపరమైన సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతారు. అంటే లా గురించి చెప్పగలుగుతారు. కానీ వారు కోర్ట్ లో ఒక క్లయింట్ తరపున వాదించలేరు. కానీ అడ్వకేట్ కోర్టులో ఒక క్లైంట్ తరుపున వాదించగలుగుతారు. కేసుని బట్టి తన క్లైంట్ కి నష్టపరిహారం ఇప్పించడం లాంటివి చేయగలుగుతారు.

Difference between lawyer and advocate

అప్పుడే లా స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అవ్వటం వలన అడ్వకేట్ తో పోలిస్తే ఒక లాయర్ కి అనుభవం తక్కువగా ఉంటుంది. న్యాయస్థానంలో ఒక క్లయింట్ తరపున వాదించడానికి అనుభవం కావాలి. అడ్వకేట్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. అలాగే ఎన్నో కేసులను వాదించడం వలన అడ్వకేట్ కి అనుభవం ఎక్కువగా ఉంటుంది.

Difference between lawyer and advocate

లాయర్ కోర్ట్ లో కేసు వాదించలేరు. అంతే కాకుండా లాయర్ కి అనుభవం తక్కువగా ఉంటుంది. అందుకే అడ్వకేట్ తో పోలిస్తే లాయర్ ఛార్జ్ చేసే ఫీజ్ తక్కువగా ఉంటుంది. అనుభవం ఎక్కువగా ఉండటం వలన, ఏ రకమైన విషయంలో అయినా ఒక క్లైంట్ తరపున వాదించే అంత పట్టు ఉండటం వలన అడ్వకేట్లు లాయర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటారు.

Difference between lawyer and advocate

ఒకవేళ ఒక వ్యక్తి ఇంగ్లాండులో, సౌత్ ఆఫ్రికాలో, లేదా స్కాట్ ల్యాండ్ లో లా చదివి వస్తే వారిని బారిష్టర్ అని అంటారు. బారిస్టర్ కూడా అడ్వకేట్ తో సమానం. కేవలం పేరు తేడా అంతే. కానీ బారిస్టర్ కూడా అడ్వకేట్ లాగానే కేస్ టేకప్ చేసి వాదించగలరు.


End of Article

You may also like