శ్రావణ మాసం అనగానే ముందు గుర్తొచ్చే స్త్రీలు పాటించే నోములు, పూజలే. మహాలక్ష్మి దేవి కి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం లో వారు తమ సౌభాగ్యం కోసం నోములు, వ్రతాలూ చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఈ మాసం శివుడికి, నారాయణుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసమంతా. ఈ మాసం గురించి మరిన్ని విశేషమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

sravana masam 1

చాంద్రమానం ప్రకారం వచ్చే ఐదవ మాసాన్ని శ్రావణ మాసం అంటాం. కలియుగ దైవం వేంకటేశ్వరుని జన్మ నక్షత్రమైన “శ్రవణ” నక్షత్రం పేరు మీదుగా వచ్చే ఈ శ్రావణ మాసం లో పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి. మంగళ వారాలు గౌరీ పూజకు, శుక్ర వారాలు లక్ష్మి అమ్మవారి పూజకు, శనివారం వేంకటేశ్వరుని పూజకు అనుకూలమైనవి. మహిళలకు సౌభాగ్యాలను ఇచ్చే వ్రతాలు ఎక్కువ గా చేసుకునే మాసం కాబట్టి ఈ మాసాన్ని సౌభాగ్య మాసం అని పీల్చుకుంటూ ఉంటాం.

sravana masam 2

మహిళలు ఎక్కువ గా ఆచరించే వ్రతాలలో మంగళ గౌరీ వ్రతం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. కొత్త గా పెళ్లి అయిన ముత్తైదువులు ఐదేళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. నెలలో అన్ని మంగళవారాలు ఈ నోమును చేయడం తో పాటు.. శ్రావణ మాసం లో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. శ్రావణ మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేస్తారు. అలాగే శ్రావణ మాసం లో అనేక పండగలు కూడా వస్తాయి.

నాగుల చవితి:

Nagula chavithi
మన రాష్ట్రము లో చాలా ప్రాంతాలలో ఈ నాగుల చవితి ని వేడుకగా జరుపుతారు. ఆరోజు ఉదయాన్నే పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి, నాగేంద్ర స్వామిని పూజిస్తారు.ఆ రోజు అంతా ఉపవాసం ఉంటారు.

రాఖి పౌర్ణమి:

Rakhi Pournami
సోదర, సోదరిల బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని గుర్తు చేసే పండగ రాఖి పండగ. ఈరోజున సోదరుల సుఖ సంతోషాలను కోరుకుంటూ చెల్లెల్లు, అక్కలు తమ సోదరులకు రాఖీలను కడతారు. ఆ తరువాత మిఠాయి తినిపించి ఆశీర్వాదం తీసుకుంటారు. సోదరులు తమ సోదరికి ఏదైనా చిరు కానుకలు ఇవ్వడం ఎప్పటినుంచో ఆనవాయితీ గా వస్తోంది.

కృష్ణాష్టమి:

Krishnashtami
శ్రావణ మాసం లో వచ్చే అష్టమి తిథిని కూడా మనం వేడుకగా జరుపుకుంటాం. ఎందుకంటే.. ఈ రోజు శ్రీమన్నారాయణుడి ఎనిమిదవ అవతారమైన శ్రీ కృష్ణుని జన్మదినం కాబట్టి. పగటి సమయం లో ఉపవాసం చేస్తూ.. సాయంత్ర సమయం లో ఆ కృష్ణ పరమాత్మకు పాలు, పెరుగు, మీగడ, వెన్న లను నైవేద్యం గా సమర్పిస్తారు.

పొలాల అమావాస్య:

Polala amavasya
ఈ పండుగ సందర్భం గా వృషభాలను పూజిస్తారు. ఆ తరువాత కాల గమనం లో ఈ పర్వదినం పోలేరమ్మ ను పూజించే పర్వదినం గా మార్పు చెందింది. ఈ పూజ చేసుకోవడం వలన పిల్లలకు అకాలమృత్యువు తప్పిపోతుందని చెబుతుంటారు.

హయగ్రీవ జయంతి:

Hayagreeva jayanthi
శ్రీ మహా విష్ణువు వేదాలను రక్షించడం కోసమే హయగ్రీవ రూపాన్ని ధరించడాన్ని చెబుతుంటారు. శ్రీ మహా విష్ణువు ఈ అవతారం ఎత్తిన రోజునే హయగ్రీవ జయంతి గా చెప్పుకుంటుంటారు. ఈరోజున శనగలు, గుగ్గిళ్ళతో చేసిన నైవేద్యాన్ని హయగ్రీవుడికి అర్పిస్తారు.

కామిక ఏకాదశి:

kamika ekadasi
ఈరోజున ఏకాదశి వ్రత నియమాలను, ఉపవాసాన్ని పాటిస్తారు. అలాగే నవనీతాన్ని దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు.

పుత్రదా ఏకాదశి:

putrada ekadasi
ఈ ఏకాదశి కే లలిత ఏకాదశి అని మరో పేరు ఉంది. పుత్ర సంతానం కోరుకునే మహిళలు ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఫలితాలు ఉంటాయి.