యువ హీరో నితిన్ ప్రస్తుతం ఒక మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ‘భీష్మ’ తర్వాత ఇప్పటివరకు నితిన్‌కు మరో హిట్టు లేదు. ఇక ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన ‘మాచర్ల నియోజక వర్గం’ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుని డిజాస్టర్‌గా మిగిలింది.

Video Advertisement

నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ తో ఒక చిత్రం చేస్తున్నాడు. వక్కంతం వంశీ రైటర్ గా ఎన్నో మంచి కథలను అందించాడు. రైటర్‌గా సక్సెస్ అయ్యాడు. అయితే దర్శకుడిగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నా పేరు సూర్య సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా మారాడు.  వంశీ దాదాపు నాలుగేళ్ళు గ్యాప్‌ తీసుకుని నితిన్‌తో రెండో సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో పూజా కార్యక్రమాలతో లాంచ్‌ అయిన ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ ప్రారంభించింది.

nithin's macharla niyojakavargam ott release date..

అయితే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా ఫస్ట్‌ షెడ్యూల్‌ ప్రారంభించింది. మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇక్కడ ఒక ఇంట్రస్టింగ్ విషయం తెర మీదకు వచ్చింది అదేమిటంటే ఈ సినిమాలో నితిన్ ఒక స్మగ్లర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్రలో నితిన్ పూర్తిగా గడ్డంతో రఫ్ లుక్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్ లారీ డ్రైవర్ గా కూడా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

what is the link between pushpa and nithin's new movie..??

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కూడా మారేడుమిల్లి అడవుల్లోనే జరుగుతూ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అవన్నీ పుష్పని గుర్తు చేసేవే కాబట్టి. పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ గా, లారీ నడుపుతాడు పూర్తిగా గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తాడు. అయితే ఇవన్నీ గుర్తు రాగానే అసలు ఇప్పుడు నితిన్ ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్ చేస్తున్నాడా అనే చర్చ జరుగుతోంది.

what is the link between pushpa and nithin's new movie..??

అయితే అందుతున్న సమాచారం మేరకు …ఇదొక ఫన్ ఫిల్మ్ అని, నితిన్ ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడని సమాచారం.  ఇక ఈ సినిమాలో నితిన్ సరసన హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతోంది. అంతే కాకుండా తిన్ కెరీర్ ని మలుపు తిప్పే సబ్జెక్టు అవుతుందని అంటున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో విడుదల వరకు వేచి చూడాల్సిందే.