సోషల్ మీడియా వచ్చాక సెలెబ్రెటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. వారు సెకండ్లలో అప్ డేట్ లు ఇచ్చేస్తే.. నిమిషాల్లో అవి అభిమానులను చేరిపోతుంటాయి. ఒక్కోసారి వారు ఇచ్చే అప్ డేట్ లు దేనిని ఉద్దేశించో అర్ధం కాకపోతే.. ఇక ఆ పోస్ట్ లు సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తుంటాయి.

 

టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా సెలెబ్రిటీలు సోషల్ మీడియా లో తమ తమ ఫాన్స్ తో టచ్ లోనే ఉంటారు. అయితే.. తాజాగా హృతిక్ రోషన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియా లో రచ్చ లేపుతోంది. హృతిక్ తన సింగల్ ఫోటో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ఓకేనా..? అంటూ పోస్ట్ లోనే కియారా ను కూడా టాగ్ చేసారు. అయితే.. కియారా వెంటనే స్పందించి.. ఇది సరిపోదు అని చెప్తూ.. తన ఫోటో ను యాడ్ చేసి ఇది బెటర్ అనుకుంటా.. నువ్వేమి అనుకుంటున్నావు అంటూ విజయ్ దేవరకొండ ను టాగ్ చేసారు.

దీనితో అభిమానులకు ఎక్కడలేని సందేహాలు వచ్చాయి. ఇది ఇక్కడితో ఆగలేదు.. విజయ్ దేవరకొండ కూడా స్పందించి, కాస్త రౌడీనెస్ తగ్గింది అంటూ అదే ఫోటో లో తన పిక్ ను కూడా యాడ్ చేసారు. అంతే కాదు.. ఈ ఫోటో పై స్పందించాలి అంటూ సమంత ను కూడా టాగ్ చేసాడు. రౌడీ అన్న సమంత ని టాగ్ చేయడం తో కొత్త చర్చ మొదలైంది. అసలు ఏమి జరుగుతోంది? అని నెటిజన్లు పిచ్చి గా థింక్ చేసేస్తున్నారు.

samanatha

ఈ స్టార్స్ ఎప్పుడు ఒక సినిమాలో నటించలేదు. మరి ఎందుకు వీళ్ళ ఫొటోస్ యాడ్ చేస్తున్నారు? అన్న డౌట్ వస్తున్నాయి. విజయ్ దేవరకొండ సమంత ను ఎందుకు స్పందించమని కోరాడో ? కూడా ఎవరికీ అర్ధం కాలేదు. మొత్తానికి ఎదో అప్ డేట్ అయితే వచ్చే అవకాశం ఉందని అందరు ఊహించేసుకుంటున్నారు. అయితే దీనిపై సమంత ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది.