Ads
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో కొత్త కొత్త పేర్లతో సినిమాలు విడుదల అవుతున్నాయి. బాహుబలి, RRR పేర్లతో రాజమౌళి. KGF, సలార్ చిత్ర పేర్లతో ప్రశాంత్ నీల్ ఎప్పుడు వినని విధంగా ప్రేక్షకులకు కొత్త పేర్లను పరిచయం చేస్తున్నారు. వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకువెళ్లిపోతున్నారు.
Video Advertisement
ఇలా సినిమా టైటిల్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అదేవిధంగా వీళ్లు పెట్టిన ఈ సినిమా పేర్లు అన్ని భాషల సినిమాలకు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. వీరు సినిమాలు ఇచ్చే టైటిల్ మీనింగ్ కూడా కొత్త విధంగా ఉంటుంది.
ఈ విధంగా కొత్తదనంతో టైటిల్ పెట్టడంతో వీళ్ళ సినిమాలు అంచనాలు మించిపోతూన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వీరిరువురూ స్టార్ హీరోలతోనే సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతారు. రాజమౌళి మరియు ప్రశాంత్ నీల్ ఒక్కొక్క సినిమా పర్ఫెక్షన్ కోసం ఒకటి నుండి రెండు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటారు. అలాగే సినిమా టైటిల్స్ కూడా మంచి ప్రాముఖ్యతనిస్తూ ప్రేక్షకుల్లో సినిమా రేంజ్ ను పెంచుతూ ఉంటారు. వీళ్ళిద్దరికీ కష్టానికి ప్రతిఫలంగా సినిమా సక్సెస్ అవడంతో పాటు దర్శకుల రేంజ్ కూడా పెంచుతుంది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 200 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా సలార్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికీ 35 శాతం పనులు పూర్తి చేసుకుందని సమాచారం అందుతుంది. ఈ ఏడాది చివరినాటికల్లా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని సమాచారం.
ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో ఐదు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనిపై అధికారికమైన సమాచారం రావాల్సి ఉంది.
End of Article