ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు సినిమా సత్తాని అంతర్జాతీయ వేదికగా చాటారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమా  ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ పొందడమే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ ను కూడా అందుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జక్కన్న గురించి చర్చించుకుంటున్నారు. హాలీవుడ్ దిగ్గజాలు  కూడా రాజమౌళి సినిమాలను పొగిడేస్తున్నారు.

Video Advertisement

ప్రస్తుతం దక్షిణాది ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం రాజమౌళి మూవీలో చిన్న పాత్ర అయినా చేయాలని భావిస్తున్నారు. అయితే రాజమౌళి తీసే ప్రతి చిత్రంలో కొంత మంది నటీనటులు తప్పనిసరిగా కనిపిస్తారు. అలా ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన ప్రతి చిత్రంలో నటించే యాక్టర్స్ లో చత్రిపతి శేఖర్ ఒకరు. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన శాంతి నివాసం అనే సీరియల్ నుండి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు శేఖర్ కనిపించారు.chatrapathi-shekharచత్రిపతి శేఖర్ జక్కన్న తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుండి సింహాద్రి, చత్రపతి, సై, విక్రమార్కుడు, మర్యాద రామన్న, మగధీర, ఈగ, ఆర్ఆర్ఆర్ సినిమాలలో నటించాడు. ఇప్పటి దాకా రాజమౌళి 12 సినిమాలను తీయగా శేఖర్  9 చిత్రాల్లో ఉన్నాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి చిత్రంలో శేఖర్ ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి గుర్తింపు పొందాడు. అప్పటి నుండి ఈ సినిమా పేరే నుంచి ఆయన పేరుగా మారి చత్రపతి శేఖర్‏గా పాపులర్ అయ్యాడు. కాగా జక్కన్న చిత్రాలలో శేఖర్ ఎక్కువగా నటించడానికి కూడా ఒక రీజన్ ఉందంట. రాజమౌళి మొదటిసారి డైరెక్షన్ చేసిన శాంతి నివాసం సీరియల్ టైమ్ లో శేఖర్‏తో పరిచయం ఏర్పడిందంట. అదే స్నేహంగా మారినదంట. అయితే శేఖర్ రాజమౌళిని ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వమని అడగలేదట. అయితే తనకు నటుడిగా సపోర్ట్ చేయాలని జక్కన్న తన చిత్రాలలో ఛాన్స్ ఇస్తుంటారని శేఖర్ ఒక సందర్భంలో తెలిపారు.సినిమా ప్రారంభించిన తరువాత రాజమౌళి పిలుస్తాడని, అప్పటి దాకా ఆ మూవీ ఏమిటి, అందులో తన క్యారెక్టర్ ఏమిటనేది తనకు తెలియదని చెప్పారు. మొదటి సీరియల్ సమయంలో ఏర్పడిన పరిచయం, స్నేహానికి అంతగా ఇచ్చే విలువ గురించి తెలిసి నెటిజన్స్  రాజమౌళికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Also Read: తెలుగులో అన్ని మంచి సినిమాలు ఉండగా RRR కి మాత్రమే “ఆస్కార్” ఎందుకు..? కారణాలు ఇవేనా..?