అక్కడ ఫ్లాప్.. ఇక్కడ మాత్రం విపరీతమైన రెస్పాన్స్..! ఏం ఉంది ఇందులో..?

అక్కడ ఫ్లాప్.. ఇక్కడ మాత్రం విపరీతమైన రెస్పాన్స్..! ఏం ఉంది ఇందులో..?

by kavitha

Ads

మ‌ల‌యాళ యాక్టర్ టోవినో థామ‌స్‌ రీసెంట్ గా విడుదలైన 2018 చిత్రంతో తెలుగులో హిట్ అందుకున్నాడు. అతను  మలయాళ ఇండస్ట్రీలో విభిన్న కాన్సెప్ట్‌ల‌తో చిత్రాలు చేస్తాడ‌ని గుర్తింపు తెచ్చుకున్నాడు. టోవినో థామ‌స్‌ కొన్ని మలయ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కు చేరువ అయ్యాడు.

Video Advertisement

టోవినో థామ‌స్ హీరోగా తెరకెక్కిన మరో మ‌ల‌యాళ సినిమా ‘నీలవెలిచమ్’ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హార‌ర్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో నిరాశపరిచింది. కానీ ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతగా ఈ మూవీలో ఏముందో ఇప్పుడు చూద్దాం..
టోవినో థామ‌స్‌ తెలుగు ఆడియెన్స్ సుపరిచితమైన పేరు. ఇప్పటికే ఎన్నో డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగువారిని పలకరించారు. ఇటీవల వచ్చిన 2018 కు తెలుగులో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. టోవినో థామ‌స్‌ నటించిన ‘నీలవెలిచమ్’ అనే చిత్రం ఏప్రిల్ 23 న థియేటర్లలో విడుదల అవగా ప్లాప్ గా నిలిచింది. కానీ మే 23న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ మూవీకి మంచి స్పందన ఆడియెన్స్ నుండి వస్తోంది.ఆషిక్ అబూ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో రిమా క‌ల్లింగ‌ల్‌, టామ్ చాకో, రోష‌న్ మాథ్యూ ముఖ్యమైన పాత్ర‌ల‌ను పోషించారు. 1964లో విడుదలైన విజయనిర్మల నటించిన ‘భార్గ‌వి నిల‌యం’ చిత్రం మ‌ల‌యాళంలో హార‌ర్ చిత్రాలకు స్పూర్తిగా నిలిచింది. 50 ఏళ్ల క్రితం మాలీవుడ్ లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన ఆ చిత్రం రీమేక్‌గా ‘నీల వెలిచమ్‌’ను తీశారు.
బ‌షీర్ (టోవినో థామ‌స్‌) ఒక రచయిత. స్టోరి రాయ‌డం కోసం స‌ముద్రం తీరంలో ఉన్న ఒక ప‌ల్లెటూరికి వ‌స్తాడు. ఆ ఊరి చివర్లో ఉండే భార్గ‌వి నిల‌యం అనే పాత ఇంట్లో అద్దెకు దిగుతాడు. అయితే ఆ ఇంట్లో భార్గ‌వి అనే ఆత్మ ఉంద‌ని ఊర్లో  వారు చెప్పుకుంటారు. వారిలో కొంద‌రు ఆ ఆత్మ‌ను కూడా చూస్తారు. ఆ ఇంట్లోకి ఎవ‌రూ వచ్చినా స‌హించ‌ని ఆత్మ అద్దెకు వెళ్ళిన బ‌షీర్‌ను ఏం చేయ‌దు. ఊర్లో వారు చెప్పే కథలు విన్న బ‌షీర్ ఆమె మరణం వెనుక ఉన్న వాస్తవం తెలుసుకొని స్టోరీగా రాయాలని నిర్ణ‌యించుకుంటాడు.
కథ రాసే క్ర‌మంలో బ‌షీర్ ఎటువంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? భార్గ‌వి ఎలా మరణించింది ? ఆమెను ప్రేమించిన శివ‌కుమార్ మాయం అవడం వెనుక ఉన్న కార‌ణం ఏమిటి? భార్గ‌వి మేన‌మామ నారాయ‌ణ‌న్ బ‌షీర్‌ను ఎందుకు చంప‌డానికి ప్ర‌య‌త్నించాడు అనేదే మూవీ స్టోరి. కథ కొత్తది కానప్పటికీ, దర్శకుడు ఈ చిత్రాన్ని థ్రిల్లింగ్‌గా న‌డిపించారు.

Also Read: హీరోయిన్లను రిపీట్ చేసిన 12 మంది డైరెక్టర్స్.! ఏ డైరెక్టర్ ఏ హీరోయిన్ ని రిపీట్ చేసారో చూడండి.!


End of Article

You may also like