హీరో సిద్ధార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలతో  తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. సిద్ధార్థ్ కు అప్పట్లో అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ లో ఉండేది. కానీ, ఆ తరవాత సిద్ధార్థ్ సెలెక్ట్ చేసుకున్న సినిమాలు ఆడియెన్స్ ను పెద్దగా అలరించలేదు. దాంతో టాలీవుడ్ లో మార్కెట్‌ను పోగొట్టుకున్న సిద్ధార్థ్ కోలీవుడ్ కు  వెళ్లిపోయారు.

Video Advertisement

సిద్ధార్థ్ హీరోగా అరుణ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమిళ సినిమా ‘చిత్త’ సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. తెలుగులో చిన్నాగా రాబోతున్న ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ నుండి కోలీవుడ్ వెళ్ళిన సిద్ధార్థ్ రెండేళ్ల కిందట ‘మహా సముద్రం’ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత ‘టక్కర్’ అనే మూవీటో వచ్చారు. అది కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు సిద్ధార్థ్ కోలీవుడ్ లో రిలీజ్ అయ్యి, అందరి చేత ప్రశంసలు పొందుతున్న సిద్ధార్థ్ సినిమాని తెలుగులో ‘చిన్నా’ పేరుతో అక్టోబర్ 6న రిలీజ్ చేయబోతున్నారు. కోలీవుడ్ లో తెరకెక్కిన చిత్త మూవీని ఎటాకి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించగా, సిద్ధార్థ్ సమర్పించారు. ఈ సినిమాలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ కీలక పాత్రలలో నటించారు.
ఇక సినిమా కథ విషయానికి వస్తే, ఈశ్వరన్ (సిద్ధార్థ్) అన్న చనిపోవడంతో అతని జాబ్ ఈశ్వరన్ కు వస్తుంది. అన్న కూతురిని ఈశ్వరన్ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తినడం, స్కూల్ కి తీసుకెళ్లడం దగ్గర నుండి పడుకునే వరకు అన్ని పనులు తనే చేస్తూ ఉంటాడు. అయితే ఆ పాపకి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆమెతో ఎవరో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. అప్పటినుండి ఆ పాప అదోలా మారిపోతుంది.
అది ఏమిటో తెలుసుకుందామని ఈశ్వరన్ ప్రయత్నిస్తే, ఆ పాపని అతనే ఏదో చేసాడనుకుని అందరూ ఈశ్వరన్ కొడుతారు. అయితే ఈశ్వరన్ ఏ తప్పు చేయలేదని తెలుసుకునే లోపు, ఈశ్వరన్ అన్న కూతురిని ఎవరో ఎత్తుకెళ్తారు. ఆ తరువాత ఏం జరిగింది? ఈశ్వరన్ తన అన్నకూతురిని ఎలా రక్షించాడు? అతను ఏ తప్పు చేయలేదనే విషయం తెలిసిందా? అనేది మిగిలిన కథ.

Also Read: హీరోయిన్ “కుష్బూ” కి ఈ గుడి వాళ్ళు పూజ ఎందుకు చేసారు..? అసలు విషయం ఏంటంటే..?