ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?

ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?

by kavitha

Ads

ఉగాది పండుగ రోజున తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందువల్ల తెలుగు వారి పండుగగా చెప్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వచ్చే ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు, రాశిఫలాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొవడానికి ఉగాది పండుగ నాడు పంచంగ శ్రవణం చేస్తారు.

Video Advertisement

ఈ ఏడాది మార్చి 22న ఉగాది పండుగను జరుపుకొనున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగను ఎందుకు జరుపు కుంటారు? ఉగాది విశిష్టత మరియు చరిత్ర గురించి, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని విశ్వసిస్తారు. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించడంతో విష్ణువు మత్స్యావతారంలో సోమకుడిని సంహరించి వేదాలను తిరిగి విధాతకు  ఇచ్చిన సందర్భంలో ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణాలలో చెప్పబడిందని అంటారు.ugadi-festival-importace1బ్రహ్మ దేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో జగత్తును సృష్టించాడని చెప్తారు. అనగా కాలగణన, నక్షత్ర, గ్రహ, రుతు, మాస, వర్షాధికులను విధాత ఆ రోజు నుండి వర్తింపజేస్తాడని విశ్వసిస్తారు. వసంత రుతువు ఆనాటి నుండే మొదలు అవుతుంది. అందువల్ల కొత్త జీవితానికి ప్రారంభంగా ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది మరియు యుగాది అనే 2 పదాలు వాడుతుంటారు. ‘ఉగ’ అనగా నక్షత్ర గమనం, ఆది అనగా మొదలు అని అర్దం. నక్షత్ర గమనానికి ఆది అనగా సృష్టి ప్రారంభం అయిన రోజే ఉగాది.
ugadi-festival-importace2తెలుుగు ప్రజలు మాత్రమే కాకుండా ఈ పండుగను మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళ ప్రజలు ‘పుత్తాండు’ పేరుతో, సిక్కులు ‘వైశాఖీ’గా, మలయాళీలు ‘విషు’ గా,  బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు. ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. ఈ రోజున అందరు కొత్త ఉత్సాహంతో, నూతన ఆశలతో తమ జీవితాన్ని ప్రారంభిస్తారు. ఉగాది నాడు చేసే ప్రసాదాలలో ఉగాది పచ్చడి ముఖ్యమైనది.
ugadi-pachhadiఉగాది పచ్చడి ప్రాముఖ్యత:
ఈ పండుగ నాడు చేసే ఉగాది పచ్చడి షడ్రచుల సమ్మేళనం.  జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలను ఉగాది పచ్చడి సూచిస్తుంది. పచ్చడి తయారీలో వాడే ఒక్కొ పదార్థం ఒక్కో భావానికి ప్రతీకగా సూచిస్తారు. బెల్లం తీపికి గుర్తు అనగా సంతోషానికి, ఉప్పు ఉత్సాహనికి,  వేప పువ్వులోని చేదు బాధకు, చింతపండులోని పులుపు నేర్పు, పచ్చి మామిడిలోని వగరు కొత్త సవాళ్లు, కారం సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు ప్రతీక.
ugadi-festival-importace-4Also Read: “ఉగాది” పండుగ రోజు ఈ పనులు అస్సలు చేయకండి..!!


End of Article

You may also like