తెలుగు బుల్లితెర చరిత్రలోనే చాలా తక్కువ సీరియళ్లు మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి. అందులో ‘కార్తీక దీపం’ ఒకటి. ఇందులో హీరోయిన్‌గా నటించిన ప్రేమీ విశ్వనాథ్‌కు ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీప అలియాస్ వంటలక్కగా ఇందులో ఆమె కనిపించిన తీరు.. చేసిన యాక్టింగ్ అందరికీ గుర్తుండిపోతుంది. మలయాళంలో బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే తన హవాను చూపించి స్టార్‌గా ఎదిగిపోయింది ప్రేమీ విశ్వనాథ్.

Video Advertisement

మలయాళం లో సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సీరియళ్లలో నటించిన ఆమె.. ‘కరుతముత్తు’ అనే సీరియల్‌లో అద్భుతమైన యాక్టింగ్‌తో అలరించింది. ఇందులో ఆమె పోషించిన పాత్ర హైలైట్ అయింది. అదే తెలుగులోకి ‘కార్తీక దీపం’ అనే పేరుతో రీమేక్ అయింది. ఈ సీరియల్‌లో దీప అలియాస్ వంటలక్కగా ఆమె అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎలాంటి సీన్‌నైనా అలవోకగా చేస్తూ మెప్పించింది. దీంతో తెలుగింటి ఆడపడుచులా ఆదరణ అందుకుంది.

 

what is vantalakka doing after karhtika deepam..

అయితే తాజాగా కార్తీక దీపం సీరియల్ ముగిసింది. దీంతో ప్రేమి విశ్వనాధ్ తదుపరి ప్రాజెక్ట్స్ ఏంటి.. ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని ఆమె ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. కార్తీక దీపం 2 ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్.. కానీ ఫస్ట్ పార్ట్ కి మించిన కథ దొరకడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. అయితే మరో వైపు ప్రేమికి సినిమాల్లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఆమె ఆచి తూచి ప్రాజెక్ట్స్ ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య చిత్రం లో ఆమె నటిస్తున్నట్లు అధికారికంగా కంఫర్మ్ అయిపోయింది.

what is vantalakka doing after karhtika deepam..

 

అయితే ప్రేమికి కేరళలో ఇప్పటికే రెండు స్టూడియో లు ఉన్న విషయం తెలిసిందే. మలయాళ సినిమాలు, సీరియల్స్ షూటింగ్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఈ స్టూడియోలోనే జరుగుతాయని ప్రేమి గతం లో వెల్లడించారు. అలాగే ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ ని కూడా ప్రారంభించే యోచనలో ఉందట మన వంటలక్క. ప్రస్తుతం ఓన్ ప్రొడక్షన్ హౌస్ పనుల్లో ఈమె బిజీగా ఉన్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప్రాజెక్ట్ లను నిర్మించాలని ప్రేమీ విశ్వనాథ్ భావిస్తున్నారని సమాచారం. భవిష్యత్తులో ప్రేమీ విశ్వనాథ్ భారీ ప్రాజెక్ట్ లను నిర్మించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.