టాలీవుడ్ లో హీరోయిన్లకు కొదవ లేదు. ప్రతి ఏడాది ఎందరో హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగు పెడతారు. అలా ‘ఏజెంట్‌’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేసింది హీరోయిన్ సాక్షి వైద్య. తొలి సినిమాతోనే తన నటనతో అందరిని ఆకట్టుకుంది సాక్షి వైద్య.

Video Advertisement

 

 

అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. కానీ సాక్షి వైద్య నటన కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాక్షి వైద్య తన గురించి పలు విషయాలను వెల్లడించారు.

what sakshi vaidya did before coming into movies..!!

“వృత్తి పరం గా నేను ఫిజియోథెరపిస్ట్ ని. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని డాక్టర్ విఠల్‌రావ్ విఖే పాటిల్ ఫౌండేషన్ మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేశాను. కానీ కరోనా సమయం లో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పుడు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు చాలా ఆదరణ లభించింది. కొన్ని ప్రకటనల్లో కూడా నటించాను.

what sakshi vaidya did before coming into movies..!!

అవి కాస్త వైరల్ కావడంతో చాలామంది సినిమాలలోకి ట్రై చేయొచ్చు కదా అంటూ సలహాలు ఇచ్చారు. దీంతో నా స్నేహితులు సినిమాల్లో ప్రయత్నించమని అడిగారు. అప్పుడు ముంబై లో కొన్ని ఆడిషన్స్ లో పాల్గొన్నాను. కానీ పాత్రలు నచ్చక వదిలేసాను. ఇక తిరిగి నా లైఫ్ లో బిజీ అయిపోయాను. ఆ సమయంలోనే ఏజెంట్ మూవీ టీం నుంచి తనకు ఫోన్ కాల్ రావడం..మీకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని చెప్పడంతో అదొక పెద్ద స్కాం అనుకొని ఆ ఫోన్ కాల్ లైట్ తీసుకున్నాను.

what sakshi vaidya did before coming into movies..!!

నాకు పరిచయం ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏజెంట్ సినిమా గురించి చెప్పడంతో హైదరాబాద్ కి వచ్చి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ లో ఓకే అయి హీరోయిన్ నేనే అని చెప్పడంతో ఒక్కసారిగా నమ్మలేకపోయాను. ప్రస్తుతం తెలుగులో మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా. వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా కన్‌ఫర్మ్‌ అయింది.” అని సాక్షి వైద్య తన గురించి ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించింది.

Also read: ACTRESS SAKSHI VAIDYA IMAGES, AGE, PHOTOS, FAMILY, BIOGRAPHY, MOVIES LIST