Ads
టెలివిజన్ చరిత్ర చెప్పాలంటే చాలా కథే ఉంది. బ్లాక్ అండ్ వైట్ టీవీతో మొదలైన ప్రస్థానం.. స్మార్ట్ టీవీగా పరిణామం చెందింది. ఇది లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి కుటుంబం లో ఒక సభ్యుడిలా మారిపోయింది టీవీ. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మంచి స్మార్ట్ టీవీని కొనాలని భావిస్తున్నారు. స్మార్ట్ టీవీ కొనేముందు మంచి ఫీచర్లు, పిక్చర్ క్వాలిటీ, మంచి సౌండ్ సిస్టమ్ ఇలా అన్నింటినీ పరిశీలిస్తారు. అన్నీ ఫర్‌ఫెక్ట్‌గా ఉంటే.. ఇంట్లో టీవీ షోలు, సినిమాలు చూస్తే థియేటర్‌లో చూసిన అనుభూతి కలుగుతుంది.
Video Advertisement
అయితే మంచి ఆఫర్స్ వస్తుండటం తో చాలా మంది తమ పాత టీవీలను మార్చేసి పెద్ద పెద్ద స్మార్ట్ టీవీ లను కొంటున్నారు. అయితే ఎలాంటి టీవీ కొనుగోలు చేయాలి, మన లివింగ్ రూమ్ లేదా డ్రాయింగ్ రూమ్ కి సరిపడా టీవీ కొంటున్నామా..?? అసలు ఎంత దూరానికి ఎంత సైజు టీవీ కావాలి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా టీవీ కొనేటప్పుడు అందరు చూసే విషయాలు ఏంటంటే..పిక్చర్ క్వాలిటీ బావుందా..? సౌండ్ సరిగ్గా వస్తుందా..? హార్డ్ డిస్క్ సపోర్ట్ ఉందా ..? వై-ఫై, మోషన్ సెన్సార్ వంటి ఫీక్చర్స్ ఉన్నాయా..? వంటి విషయాలను మాత్రమే చూస్తాం. కానీ వాటి తో పాటు చూడాల్సిన ఇంకో విషయం ఉంది.. అదే టీవీ సైజు.. మనం ఎంత దూరం నుంచి టీవీ చూస్తాం అన్న దాన్ని బట్టి టీవీ సైజు ని ఎంచుకోవాలి..
మీరు ఎల్ఈడి, అల్ట్రా హెచ్ డి లేదా ఓఎల్ఈడి టీవీని కొనుగోలు చేయడం గురించి ఆలోచించే ముందు.. మీరు టీవీని ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. స్టాండ్ పై పెడతారా.. లేదా గోడకు ఫిట్ చేస్తారా అన్నది చూసుకోవాలి. తర్వాత వ్యూయింగ్ డిస్టెన్స్ ని కొలవాలి. ఉదాహరణకి మీకు, టీవీ కి మధ్య పది అడుగుల దూరం ఉంటే దాన్ని రెండుతో భాగిస్తే వచ్చేది 60 అంగుళాలు. ఇప్పుడు మీరు కొనాల్సిన టీవీ సైజు 60 అంగుళాలు. అది టీవీ రెండు మూలల్ని కొలిస్తే 60 అంగుళాలు రావాలి.
అలాగే ఆరు అడుగుల కన్నా తక్కువ దూరం ఉంటే 40 అంగుళాలు ఉన్న టీవీ ని ఎంచుకోవాలి. ఇలా దూరాన్ని బట్టి టీవీ సైజు నిర్ణయించుకోవాలి. ఇలా కాకుండా మనకు నచ్చినట్టు టీవీ ని కొంటె తల నొప్పి తో పాటు, పలు రకాల కంటి సమస్యలు వేధిస్తాయి. అంతే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
End of Article