Ads
భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక త్వరలో నెరవేరునుంది. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. జనవరి 22వ తారీఖున ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే రామ మందిరం నిర్మాణం పూర్తయింది.
Video Advertisement
రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు. అలాగే సామాన్యులు ఎవరు అయోధ్య రాలేకపోయమని బాధపడకుండా అయోధ్య రాముని అక్షింతలు దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు మన ఇంట్లో ఉన్న కొన్ని అక్షంతలతో కలుపుకుని జనవరి 22వ తారీఖున రామ మందిర ప్రతిష్ట కార్యక్రమం జరిగేంతవరకు ప్రతిరోజు మన ఇంటిలోని శ్రీరాముని పటం వద్ద శ్రీ రామ జయ రామ అంటూ 108 సార్లు జపిస్తూ పూజలు చేయాలి.
శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి నెత్తిన జల్లుకోవాలి. మిగిలిన అక్షింతలను భద్రపరచుకొని శుభదినాల అప్పుడు వాటిని వాడుకోవాలి. శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరు బాధపడాల్సిన పనిలేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి.
End of Article