Ads
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఆరోగ్యం జాగ్రత్త చాలా అవసరం. ఆరోగ్యం జాగ్రత్త అంటే ముఖ్యమైనది ఆహార విషయంలో జాగ్రత్త గా ఉండడం. కరోనా నియంత్రించాలంటే రోగనిరోధక శక్తి అనేది చాలా అవసరం. కరోనా సోకిన వారు కూడా తమ ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు. అసలు కరోనా సోకిన వారు ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు, ఎటువంటి ఆహారం తినకూడదు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు
కరోనా సోకిన వారికి తీవ్రతని బట్టి శరీరంలో ప్రతి కేజీకి 1 నుంచి 1.5 గ్రాముల ప్రోటీన్ అందాలి. ఈ ప్రోటీన్స్ ఆహారం ద్వారా అందాలి అంటే చికెన్, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవాలి.
ఒకవేళ కరోనా సోకిన వారు శాకాహారులైతే పప్పు దినుసులు ఎక్కువగా తినాలి. పెసరపప్పు మినపప్పు కందిపప్పు వంటివాటిలో 24 శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది. అలాగే రాజ్మా శనగలు బొబ్బర్లు వంటి వాటిలో లో ప్రోటీన్ తో పాటు బి విటమిన్ పీచుపదార్థాలు ఉంటాయి.
మిల్క్ ప్రొడక్ట్స్ (పాల ఉత్పత్తులు) అంటే లో ఫ్యాట్ పనీర్, చీజ్ వంటివి తీసుకోవాలి. వీటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. అంతే కాకుండా సీడ్స్, నట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ప్రోటీన్స్ అందించడంతో పాటు ఇందులో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ కరోనా సోకిన వారికి ఆరోగ్యానికి మంచిది అని ఆహార నిపుణులు చెబుతున్నారు. వీటన్నిటితో పాటు నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి.
ఏమి తినకూడదు
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం క్వారంటైన్ లో ఉన్న వారు ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. కొంత మోతాదులో మాత్రమే వీటిని వాడాలి. అలాగే ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే ప్రాసెస్ చేసిన ఫుడ్, ఫ్రై చేసిన పదార్థాలు, పిజ్జా, బిస్కెట్స్, డో నట్స్ వంటి బేక్ చేసిన పదార్థాలు కూడా వీలైనంతవరకు అవాయిడ్ చేయాలి. అంతే కాకుండా ఆల్కహాల్ కి కూడా దూరంగా ఉండాలి. స్టీమ్, లేదా గ్రిల్ చేసిన పదార్థాలను తీసుకోవాలి.
End of Article