Home Off Beat “మోదీ” చుట్టూ ఉండే సెక్యూరిటీని గమనించారా.? ఆ సూట్ కేస్ లో ఏముంటుంది అంటే.?

“మోదీ” చుట్టూ ఉండే సెక్యూరిటీని గమనించారా.? ఆ సూట్ కేస్ లో ఏముంటుంది అంటే.?

by Mohana Priya

ఎవరైనా రాజకీయవేత్తలు కానీ, లేదా సినీ రంగానికి చెందిన వారు కానీ, లేదా మరే ఇతర రంగానికి చెందిన ప్రముఖులు కానీ బయటికి వచ్చినప్పుడు వారు ఒక్కరే రావడం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. వారితో పాటు భద్రతాదళం కూడా వస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులతో అయితే సెక్యూరిటీ గార్డ్స్ కచ్చితంగా ఉంటారు.briefcases carried by SPG commandos of Narendra Modi

వారు సాధారణమైన ఫంక్షన్స్ కి వెళ్ళినా, లేదా పెద్ద పెద్ద మీటింగ్స్ కి వెళ్ళినా ఈ సెక్యూరిటీ గార్డ్స్ చుట్టూ ఉండి ఆ రాజకీయ వేత్త దగ్గరికి జనం రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఇంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చుట్టూ ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోదీ గారు నడుస్తున్నప్పుడు చుట్టుపక్కల కొంత దూరం వరకు జనాలు సంచరించకుండా, కొన్ని సందర్భాల్లో అయితే అసలు మోదీ గారిని దగ్గర నుండి కూడా చూడడానికి వీలు లేకుండా ఆ ఎస్పీజీ కమాండోస్ జాగ్రత్తలు తీసుకుంటారు.briefcases carried by SPG commandos of Narendra Modi

అది వారి వృత్తి. కాబట్టి వారి వృత్తిని వారు అంతే జాగ్రత్తగా నిర్వర్తిస్తారు. అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? అదేంటంటే మోదీ గారి చుట్టూ ఉన్న ఎస్పీజీ కమాండోస్ చేతులలో కొన్ని బ్యాగ్స్ ఉంటాయి.

briefcases carried by SPG commandos of Narendra Modi

సాధారణంగా మనకి చూస్తే వాటిలో ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటాయి ఏమో అని అనిపిస్తుంది. కానీ కాదు. వాటిని పోర్టబుల్ బులెట్ ప్రూఫ్ షీల్డ్ అని అంటారు. అంటే అది బ్యాగ్ లాగా కనిపించే ఒక బులెట్ ప్రూఫ్ షీల్డ్.

ఏదైనా ప్రమాదం ఉన్నట్లు అనిపిస్తే, ఆ బ్యాగ్ నిలువుగా తెరిచి, ఎస్పీజీ కమాండోస్ మోడీ గారి చుట్టూ ఆ బ్యాగ్స్ తో గోడ లాగా కట్టేస్తారు. దాంతో ఆ చుట్టుపక్కల ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు దాని నుండి మోదీ గారిని రక్షించవచ్చు. ఇవి చూడటానికి బ్యాగ్స్ లాగానే అనిపిస్తాయి. కానీ అందులో ఇంత అర్ధం ఉందన్నమాట.

You may also like