“వాట్సాప్” లో జరుగుతున్న ఈ 5 మోసాల గురించి విన్నారా..? అవి ఏంటంటే..?

“వాట్సాప్” లో జరుగుతున్న ఈ 5 మోసాల గురించి విన్నారా..? అవి ఏంటంటే..?

by kavitha

Ads

అభివృద్ధి అవుతున్న టెక్నాలజీని అసరా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. గతంలో అయితే ఈ-మెయిల్స్‌, ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో మోసగించేవారు.

Video Advertisement

ప్రస్తుతం వాట్సాప్‌ ద్వారా మోసగిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించేది వాట్సాప్‌. ఈ యాప్ లేని స్మార్ట్‌ఫోన్‌ లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌లో నే ఉంటుంటారు. ప్రస్తుతం వాట్సాప్‌ స్కామ్స్ ద్వారా మోసాలు చేస్తున్నారు. అయితే ఆ స్కామ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. యూట్యూబ్ లైక్ స్కామ్ :

ఈ స్కామ్ లో ముందుగా ఒక లైక్ కి 50 రూపాయాలని మెసేజ్ చేస్తారు. ఒకసారి దానిని అగ్రీ చేసిన తరువాత మూడు ఫిషింగ్ యూట్యూబ్ లింక్స్ పంపిస్తారు. వాటిని లైక్ చేసి, స్కిన్ షాట్ వారికి పంపించిన తరువాత బ్యాంక్ వివరాలను అడుగుతారు. ఆ వివరాలు వారికి ఇచ్చిన తరువాత 150 రూపాయలను ఇస్తారు. అయితే అసలైన ట్విస్ట్ ఉంది ఇక్కడే.

ఇలా మీరు 2,3 సార్లు డబ్బులు తీసుకున్న తరువాత ప్రీపెయిడ్ టాస్క్ అని చెబుతారు. అంటే మీరు డబ్బులు పెట్టుబడి పెట్టి, లైక్ చేస్తే దానికి మూడు రెట్లు వస్తాయని చెబుతారు. అది నిజమే అని నమ్మి అలా చేస్తే నష్టపోయినట్లే. మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ వివరాలన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. వాటితో మిమ్మల్ని ఆడుకుంటారు.
2. కూపన్ స్కామ్:

ఈ స్కామ్ లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కూపన్స్ ఇస్తామని కొన్ని లింక్స్ ను వాట్సప్ లో సెండ్ చేస్తారు. ఆ లింకును ఓపెన్ చేసి, రిజిస్టర్ కాగానే ఆటోమెటిక్ గా చాలా మందికి మెసేజ్ వెళ్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఈ విధంగా ఎవరికి మెసేజ్ చెయ్యవు. ఇలాంటివన్నీ స్కామర్స్ మిమ్మల్ని ట్రాప్ చేయడం కోసం పంపిస్తారు.
3. కాల్ స్కామ్:

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న స్కామ్ లలో అతి పెద్ద స్కామ్ ఇదే. స్కామర్స్ +84,+62, +40, +234,+60 వీటితో మొదలయ్యే నంబర్ల నుండి కాల్ చేస్తారు. ఒకవేళ మీరు ఆ కాల్ ను లిఫ్ట్ చేసినట్లయితే సెకండల్లోనే మీ మొబైల్ ను హ్యాక్ చేస్తారు. ఆ తరువాత మీ బ్యాంక్ లోని డబ్బును మాయం చేస్తారు.
4. వీడియో కాల్ స్కామ్:

ప్రస్తుతం ఇది కూడా అతి పెద్ద స్కామ్ అని చెప్పవచ్చు. ఈ స్కామ్ లో వీడియో కాల్ స్క్రీన్ రికార్డ్ చేస్తారు. మీరు వీడియో కాల్ లిఫ్ట్ చేసిన దగ్గర నుండి కట్ చేసేవరకు మొత్తం రికార్డ్ అవుతుంది. ఆ వీడియో రికార్డ్ ను స్కామర్స్ మార్ఫ్ చేసి 18 ప్లస్ వీడియో గా క్రియేట్ చేసి, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ వారికి కావలసింది తీసుకుంటారు.
5. లాటరీ స్కామ్:

ఈ స్కామ్ లో ఏదైనా జెన్యూన్ కంపెనీ పేరు చెప్పి, మీరు 10 లక్షలు గెలుచుకున్నారని, క్రింద ఉన్న ఫామ్ ని నింపి, మీ అడ్రెస్ ఇస్తే గెలుచుకున్న డబ్బుని మీ ఇంటికే పంపిస్తామని చెబుతారు. దానిని నమ్మి అలా చేశారంటే మీ వివరాలన్ని స్కామర్స్ కి వెళ్తాయి. వాళ్ళు ఆ వివరాలను అమ్మేస్తారు.
మెటా కంపెనీ అఫిషియల్ గా కాల్ స్కామ్ గురించి చెప్పింది. ప్రజలను జాగ్రత్తగా ఉండమని సూచించింది. మీరు ఇలాంటివి జరగకుండా సేఫ్ గా ఉండాలంటే చేయవలసిన 4 పనులు..

1. వాట్సాప్ టూ-స్టెప్ వెరిఫికేషన్
2. బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి.
3. గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్.
4.వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకూడదు.

Also Read: “సుడాన్” యుద్ధం తో కష్టాల్లో పడ్డ కూల్ డ్రింక్ కంపెనీలు.. కారణమేంటంటే..??


End of Article

You may also like