Ads
ప్రస్తుతం మనం తినే ప్రతి ఆహార పదార్థం కల్తీ అయిపోతుంది. కేటుగాళ్లు ప్రతి దాన్ని కల్తీ చేసేస్తున్నారు. పిల్లల తాగే పాలు మొదలు ప్రతిదీ కల్తిమయం. ఇలాంటి కల్తీ పదార్థాలు తినడం వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఫలితంగా వేలకు వేలు డబ్బు ఆసుపత్రిలో కోస్తున్నారు.
Video Advertisement
మన ఇంట్లో చేసుకునే తినే పదార్థాలే కల్తీ అవుతుంటే, ఇంక బయట అమ్మే పదార్థాల గురించి అయితే చెప్పనవసరం లేదు. వీలైనంతవరకూ వాటిని అరికట్టడమే మంచిది. ఈ కల్తీ ని అరికట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. కల్తీ గురయ్యే పదార్థాల్లో గోధుమపిండి ఒకటి.
చాలామంది ఆరోగ్యం కోసం అన్నం తినడం మానేసి గోధుమపిండితో చేసిన చపాతీలను తింటూ ఉంటారు.అయితే కేటుగాల్లు దీన్ని కూడా వదలడం లేదు. అది గుర్తించలేక చాలామంది ప్రజలు అదే తినేస్తున్నారు. ఆరోగ్యం కోసమని చపాతీలు తినడం మొదలుపెడితే అదే మనకి అనారోగ్యం తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా అనారోగ్యం అవసరం లేదు, ఉన్న ఆరోగ్యం చెడిపోకుండా ఉంటే చాలు అని ప్రజలు అనుకుంటున్నారు.
అయితే ఈ గోధుమపిండి కల్తీని ఎలా గుర్తించాలి. మనం తినే గోధుమపిండి నిజమైనదేన? అందులో ఏమైనా కల్తీ జరిగిందా?ఎలా తెలుసుకోవాలి అంటే ఇందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అసలైన గోధుమపిండికి నకిలీ గోధుమపిండికి మధ్య తేడాని ఎలా కనిపెట్టాలో మీరే చూడండి.
నీటిలో కూడా గోధుమ పిండి కల్తీని కనిపెట్టవచ్చు. ఇందుకోసం మనం ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అందులో అర చెంచా పిండిని వేయాలి. ఆ తర్వాత దాన్ని బాగా కలపి 10 సెకండ్ల పాటు వేచి ఉండి కాసేపు ఆ పిండిని బాగా గమనించాలి. పిండి నీటిలో తేలుతూ కనిపిస్తే ఆ పిండి కల్తీ చేసిందని అర్థం చేసుకోవచ్చు. పిండి అడిగిన చేరుకుంటే అది కల్తీ లేనిది అని అర్థం.
చపాతీని తయారు చేసేటప్పుడు కూడా గోధుమపిండి స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. సాధారణంగా గోధుమపిండిని కలపడానికి తక్కువ నీరు అవసర పడుతుంది. అలాగే అది చాలా మెత్తగా ఉంటుంది. స్వచ్ఛమైన పిండితో చేసిన రోటీలు ఈజీగా సాగుతాయి. ఇలాంటి లక్షణాలున్న పిండిని స్వచ్ఛమైన దానిగా గుర్తించవచ్చు. అదే కల్తీ పిండి అయితే దాన్ని కలిపేటప్పుడు ఎక్కువ నీరు అవసర పడుతుంది. పిండి గట్టిగా ఉంటుంది.రోటీలు కూడా చాలా చిన్నవిగా వస్తాయి.
ఇకపైన చపాతీలు చేసుకునేటప్పుడు, గోధుమపిండి కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే కల్తీ నుండి మనం తప్పించుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్ తోటి కుటుంబ సభ్యుల తోటి షేర్ చేసుకోండి.
Also Read:ఉపాసన కొణిదల” ఆహార నియమాలు ఇంత కఠినంగా ఉంటాయా..? ఒక రోజులో ఏం తింటారంటే..?
End of Article