“తెలుగు సినిమా” లో ఇప్పటికి కూడా మారని 5 లోపాలు..! ఎప్పటికి అధిగమిస్తుందో..?

“తెలుగు సినిమా” లో ఇప్పటికి కూడా మారని 5 లోపాలు..! ఎప్పటికి అధిగమిస్తుందో..?

by Anudeep

Ads

బాహుబలి తర్వాత ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరిధి విస్తరించింది. ఆ తరువాత వచ్చే అనేక ఇండియన్ సినిమాలపై కూడా బాహుబలి ప్రభావం ఉంటుంది.

Video Advertisement

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత మెరుగ్గా ఉన్నా కొన్ని విషయాల్లో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అవేంటంటే . .

1. హీరోయిన్ కి ప్రాధాన్యత లేకపోవడం:

ఆపదలో ఉన్న హీరోయిన్ ని హీరో రక్షిస్తున్నట్టూ..  కేవలం హీరో తో డాన్స్ చేయనికి హీరోయిన్ ఉన్నట్టు ఉంటున్నాయి అనేక చిత్రాలు. హీరో కారెక్టర్ హీరోయిన్ సీన్స్ ని డామినేట్ చేస్తుంది.

2. వారసత్వం:

అల్లు-చిరంజీవి ఫ్యామిలీ, అక్కినేని-దగ్గుబాటి ఫ్యామిలీ లేదా నందమూరి ఫ్యామిలీ. తెలుగులో దాదాపు అన్ని పెద్ద సినిమాల్లోనూ వీళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు. పైగా వీరందరికి సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. కొత్త వారికి తక్కువ అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా స్టార్లు అవ్వడంతో కొంత వరకు పర్వాలేదు అనిపిస్తుంది.

3. హీరోయిన్ ను తక్కువ సమయంలోనే అమ్మ పాత్రకు షిఫ్ట్ చేయడం:

హీరోకి 60 ఏళ్ల వచ్చిన 20 ఏళ్ల బ్రహ్మచారిగా ప్రవర్తిస్తూనే ఉంటాడు. ఒక హీరోయిన్ కి 30 ఏళ్లు దాటిన తర్వాత ‘చాలా పెద్దది’ అవుతుంది. తన కంటే చిన్న హీరోకి కూడా తల్లి పాత్రలో నటిస్తుంది.

4. యువతపై చెడు ప్రభావం:

ఒక అబ్బాయి తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని నిర్ణయించుకుంటే, అతను నిరంతరం ఆమెను వెంబడిస్తాడు. హీరో హీరోయిన్ ఎల్లప్పుడూ కలిసి ఉంటారు. ఈ చర్యలు ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. ఈ సినిమాలు చూసి పెరిగిన అబ్బాయిలు ఈ స్టాకర్ లాంటి ప్రవర్తన ఓకే అని భావించేలా ప్రభావితం చేయవచ్చు.

5. బాడీ షేమింగ్:

ఇతర నటులపై సినిమాలో వెకిలి జోకులు వేస్తూ ఉంటారు. రంగు, రూపు వంటి వాటిపై బాడీ షేమింగ్ పై వేసే జోకులు అంత ఆరోగ్యకరంగా ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈ ట్రెండ్ నుంచి బయటకు వచ్చి.. ఓ బేబీ, మహా నటి, అనసూయ, రుద్రమదేవి వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇలాంటి సినిమాలు మరిన్నీ రావాలని ఆశిద్దాం..


End of Article

You may also like