Ads
పురాణాల ప్రకారం హిందూ దేవుళ్ళు సూర్య భగవాన్ కి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. సూర్యుడే లేకపోతే ఈ ప్రపంచం ఉందా చీకటిమయం అందుకే ప్రతి ఒక్కరు ఉదయం లేచిన వెంటనే సూర్య భగవానునికి నమస్కరించిన తర్వాతే తమ దినచర్యను ప్రారంభిస్తారు. సూర్యభగవానున్ని ప్రత్యేకంగా ప్రార్ధించే రోజు రథసప్తమి. అయితే ఈ సంవత్సరం రథసప్తమి ఎప్పుడు వచ్చింది అనే విషయం తెలుసుకుందాం.
Video Advertisement
మకర సంక్రాంతి తర్వాత వచ్చే మాఘ మాసం శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ వస్తుంది. 2024 సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. ఈరోజు నుంచి సూర్యుడి రథం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుంది. సూర్యుడు మొత్తం పన్నెండు రాశులని చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది. ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాడు. అదితి-కశ్యప దంపతులకి సూర్య భగవానుడు జన్మించిన రోజును రథసప్తమి అంటారు. అందుకే దీన్ని సూర్య జయంతి లేదా రథసప్తమిగా జరుపుకుంటారు.
ఇక రథసప్తమి రోజునాడు సూర్యుడికి ఏ విధంగా పూజ చేయాలి ఎటువంటి విధానాలు పాటించాలని ఇప్పుడు తెలుసుకుందాం…రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి. దీన్నే అర్ఘ్యం అని కూడా అంటారు. పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నీళ్ళలో నువ్వులు, జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి.
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. స్నానం ఆచరించే సమయంలో తల మీద ఏడు జిల్లేడు ఆకులు ధరించి స్నానం చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు. జిల్లేడు ఆకులకి అర్క పత్రాలని పేరు. సూర్యుడిని కూడా కూడా అర్క అనే పేరు ఉంది. అందుకే సూర్యునికి జిల్లేడు పత్రాలు అంటే చాలా ఇష్టం.
ఇక జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉన్నవారు ఈరోజు ఉపవాసముండి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. ఇక ఈరోజు ఆదిత్య హృదయ పారాయణం, సూర్యాష్టకం చదవడం వల్ల అంతా మంచే జరుగుతుంది.
End of Article