సాయి ధరమ్ తేజ్ కి ఆక్సిడెంట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల అయిన హెల్త్ బులెటిన్ ప్రకారం శస్త్ర చికిత్స తరువాత ఆయన త్వరగానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆయన త్వరలోనే డిశ్చార్జ్ కానున్నారు. ఐతే, ఆయన హీరో గా నటించిన “రిపబ్లిక్” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

sai dharam tej

ఇటీవల ఈ సినిమా ప్రచారం కూడా ప్రారంభించింది. దురదృష్టవశాత్తు, సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ కి గురి కావడం తో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అసలు ఈ సినిమా కు ప్రమోషన్ చేయడానికి ఓ ప్రోగ్రాం ను అనుకున్నారట. కలెక్టర్లను కలిసి థాంక్స్ చెబుతూ.. ఓ ప్రోగ్రాం ప్లాన్ చేయాలనీ అనుకున్నారట. అయితే సాయి ధరమ్ తేజ్ కు ఆక్సిడెంట్ అవడం వలన ఈ ప్రచార కార్యాకలాపాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ క్రమం లో గాంధీ జయంతి సందర్భం గా.. అక్టోబర్ 1 విడుదల కావాల్సిన “రిపబ్లిక్” సినిమా విడుదల అవుతుందా? లేదా ? అన్న సందేహాలు మొదలయ్యాయి.