సినీ రంగంలో నెగ్గుకు రావాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడవ్వాల్సిందే. ఎంత ప్రతిభ ఉన్న అదృష్టం కలిసి రాకపోతే ఒకటి, రెండు సినిమాలకే కనుమరుగైపోతారు. ముఖ్యంగా హీరోయిన్లు, డైరెక్టర్స్ విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా ప్లాప్ అయ్యింది అంటే మరో అవకాశం రావాలంటే చాల కాలమే పడుతుంది ఇండస్ట్రీ లో.

Video Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తో వరుస సినిమాలతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తున్నాడు. ఒక వైపు రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ కూడా అక్కడ బ్రేక్ తీసుకొని ఏ దర్శకులను నిరాశపరచకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన కొందరు డైరెక్టర్లు హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..

#1 వేణు శ్రీరామ్

పవన్ కళ్యాణ్ గతంలో మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించాడు. రీమేక్ సినిమా అయినా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. కానీ ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు వేణు శ్రీరామ్.

list of pavan kalyan directors who are not active now..

#2 సాగర్ కె చంద్ర

వకీల్ సాబ్ తర్వాత పవన్ కి వచ్చిన మరో హిట్ బీమ్లా నాయక్. దీనికి సాగర్ కె చంద్ర దర్శకుడు. ఈయన కూడా ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ఏం ప్రకటించలేదు.

list of pavan kalyan directors who are not active now..

#3 కిషోర్ కుమార్

పవన్ కళ్యాణ్ తో కాటంరాయుడు సినిమా తీసిన ఈ డైరెక్టర్ ఆ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు.

list of pavan kalyan directors who are not active now..

#4 యస్ జె సూర్య
పవన్ తో ఖుషి వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన డైరెక్టర్ యస్ జె సూర్య, తర్వాత కొమరం పులి తీసాడు. ఈ సినిమా ప్లాప్ కావడంతో తెలుగులో ఇంకో సినిమా చెయ్యలేదు.

list of pavan kalyan directors who are not active now..

#5 ధరణి

పవన్ తో ఈ తమిళ దర్శకుడు బంగారం చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ఇంకో తెలుగు సినిమా చెయ్యలేదు.

list of pavan kalyan directors who are not active now..

#6 జయంత్ సి. పరాంజీ
తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన జయంత్ సి. పరాంజీ.. పవన్తో తీన్మార్ చిత్రం చేసారు. ఆ తర్వాత మరో తెలుగు చిత్రం చెయ్యలేదు.

list of pavan kalyan directors who are not active now..