Ads
కలియుగ వైకుంఠము తిరుపతి పట్టణంలో చుట్టు పక్కల ఎన్నో పౌరాణిక, చారిత్రిక ప్రసిద్ది చెందిన దేవాలయాలు, తీర్ధాలు మొదలైనవి వున్నాయి. సప్తగిరుల పైన శ్రీవారు కొలువు తీరి ఉండగా, పర్వత పాదాల వద్ద ఆయన సోదరుడు శ్రీ గోవింద రాజ స్వామి వెలసినారు. గోవింద రాజ స్వామి తిరుపతికి మరెంత వైభవాన్ని తీసుకు వచ్చారు. అయితే ఇప్పుడు గోవింద రాజ స్వామి ఆలయంలో మనం చూస్తున్న విగ్రహం సుద్దతో చేసిన విగ్రహం. సాధారణంగా ఎక్కడైనా రాతి విగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ శుద్ధ విగ్రహం వుంది.
Video Advertisement
పైగా దాని వెనుక చాలా పెద్ద కధ కూడా వుంది. అయితే అసలు ఈ శుద్ధ విగ్రహం ఎలా వచ్చింది..?, అసలు ఏం జరిగింది..? అనే ఆసక్తికరమైన విషయాలని మనం చూద్దాం. యాదవ రాజు మూల విరాట్టును మలచే పనిని కొందరు నిష్ణాతులైన శిల్పులకు అప్పగించారు. అయితే అసలు ఏం అయ్యిందో తెలియదు కాని విగ్రహంలో చిన్న లోపం కలిగి వుంది. అందులో కొన్ని లోపాలను గుర్తించిన రామానుజుల వారు మరో విగ్రహాన్ని చెక్కాలని సూచించారు.
దేశ పర్యటనకు వెళ్ళాల్సి వచ్చి రామానుజుల వారు విగ్రహాన్ని చెక్కించే అవకాశం లేక సుద్దతో మూర్తిని చేసి ప్రతిష్టించారు. అయితే శుద్ధ విగ్రహానికి నీళ్లు తగిలితే కరిగిపోతుంది కనుక అభిషేకాలని నిషేదించారు. నాటి నుంచి నేటి వరకూ సుద్ద విగ్రహమే గోవింద రాజస్వామి ఆలయంలో పూజలు అందుకుంటుంది. అందుకే ఇక్కడ స్వామికి అభిషేకాలు ఉండవు. నూనెను మాత్రమే పూస్తారు. పగులు ఏర్పడిన విగ్రహాన్ని మాత్రం తిరుపతి లో మంచి నీటి కుంట వద్దని ఉంచారు. ఇప్పటికి కూడా అసలు విగ్రహం అలానే ఉంటుంది. ఆ మంచి నీటి కుంట కూడా ఎప్పుడు ఎండిపోలేదు. ఇది స్వామి వారి మహిమ అని అంటారు. నల్లరాతి మీద సుందరంగా శయన భంగిమ లో మలచిన మూర్తి లోని లోపమేమిటో మనకు అర్దం కాదు. చూడగానే మనస్సులలో భక్తి భావం కలుగుతుంది.
End of Article