Ads
అయోధ్యలోని రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ వేడుకని యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా చూసారు.
Video Advertisement
డిసెంబర్ 22, 1949 లో బాబ్రీ మసీద్ లో రాముడి విగ్రహం కనిపించింది. యాదృచ్చికంగా ఆ విగ్రహం మసీద్ లో కనిపించింది అని చెప్తారు. ఈ కారణంగా ఎన్నో సంవత్సరాలు అక్కడ గుడి కట్టాలి అనే విషయం మీద పోరాటం జరిగింది. ఇది ఎన్నో దశాబ్దాలు నడిచింది.
ఇప్పుడు మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన రాముడి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించారు. అయితే ఇప్పుడు పాత విగ్రహాన్ని ఏం చేస్తారు అనే సందేహం నెలకొంది. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఎన్డిటివికి ఈ విషయం మీద స్పష్టత ఇస్తూ చెప్పారు. పాత విగ్రహం కూడా అదే రామ మందిరంలో ఉంటుంది అని చెప్పారు. కొత్త రాముడి ప్రతిమకు ఆపోజిట్ గా ఈ విగ్రహాన్ని సింహాసనం మీద ప్రతిష్టిస్తారు అని చెప్పారు.
రెండు రాముని ప్రతిమలని సింహాసనం మీద ప్రతిష్టించారు అని చెప్పారు. ఈ రామ మందిరాన్ని 70 ఎకరాల కాంప్లెక్స్ లో దాదాపు 2. 67 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుతానికి ఒక ఫేజ్ కట్టడం పూర్తి అయ్యింది. డిసెంబర్ 2025 నాటికి రెండవ ఫేజ్ కూడా పూర్తి చేస్తారు. ఇంక ఈ వేడుకకి చాలా మంది ప్రముఖులు హాజరు అయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వెళ్లారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా హాజరు అయ్యారు.
రజనీకాంత్ కూడా ఈ వేడుకకి వెళ్లారు. చాలా మంది ప్రముఖులకి ఆహ్వానాలు అందాయి. కానీ వారిలో కొంత మంది మాత్రం వెళ్లలేదు. మరి అందుకు కారణాలు ఏంటి అనేది తెలియదు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకి కూడా ఆహ్వానం అందించారు. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ వారిద్దరూ ఆ వేడుకకి వెళ్ళలేదు.
కుటుంబంలో ఒక ఎమర్జెన్సీ సమస్య రావడం కారణంగా వెళ్లలేదు అని అన్నారు. సచిన్ టెండుల్కర్, అనిల్ కుంబ్లే వంటి వారు రామ మందిరానికి వెళ్లారు. ముఖేష్ అంబానీ కూడా రామ మందిరానికి కుటుంబ సమేతంగా వెళ్లారు. రామ మందిరం వేడుకని పురస్కరించుకొని వారి భవనం అయిన ఆంటీలియాని కూడా దీపాలతో అలంకరించారు. జైశ్రీరామ్ అనే పదాలు కనిపించేలాగా ఆ దీపాలు ఉన్నాయి. వారి భవనం ముందు ఉన్న రోడ్ అంతా కూడా ఇలాగే అలంకరించారు.
ALSO READ : అయోధ్య వేడుకలో ఇదే వెలితి… రామమందిరం కోసం ఎంతో కష్టపడ్డారు..కానీ అద్వానీ గారు ఇప్పుడు ఎందుకు రాలేదు?
End of Article