తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ పండగ పూట తమ సినిమాలను విడుదల చేయాలని బడా హీరో నుంచి అప్ కమింగ్ హీరోల వరకు అందరు ఉవ్విళూరుతారు. సంక్రాంతి 2023 రిలీజ్ విషయానికి వస్తే.. అజిత్ నటించిన తునీవు ( తెగింపు) జనవరి 11వ తేదీన, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12వ తేదీన, విజయ్ నటించిన వారిసు (వారసుడు) జనవరి 12వ తేదీన, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13వ తేదీన రిలీజ్ అయ్యాయి. అయితే నలుగురు స్టార్ హీరోలు కావడంతో ఈ సంక్రాంతి రిలీజ్ సినిమాలపై భారీ క్రేజ్ నెలకొంది.

Video Advertisement

 

ఇక ఈ సంక్రాంతి సీజన్‌లో బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీరసింహారెడ్డి మూవీని గతంలో మాదిరిగానే రీవేంజ్ స్టోరీతో తెరకెక్కించారు. వీరసింహారెడ్డి మూవీ సెకండాఫ్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సెకండాఫ్ నిడివి ఎక్కువ కావడంతో కొంతమంది ప్రేక్షకులు బోరింగ్ గా ఫీలవుతున్నారు. అయితే బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. వీరసింహ రెడ్డి చిత్రం మొత్తాన్ని బాలయ్య తన భుజాలపై మోశారు. సినిమా లో అక్కడక్కడా కొన్ని లోపాలున్నా.. క్లైమాక్స్ సమయానికి వరలక్ష్మి శరత్ కుమార్ తో వచ్చే ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా తుది ఫలితం ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది.

who is the winner of this pongal..

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం భారీ అంచనాలతో విడుదల అయ్యింది. మహారాజ్ రవితేజ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. మెగా ఫ్యాన్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించారు. శృతి హాసన్ రోల్ విషయంలో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కథ, కథనంలో కొంత ల్యాగ్, సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలు, రొటీన్ క్లైమాక్స్ ఈ సినిమాకు ఒకింత మైనస్ అయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

who is the winner of this pongal..
సంక్రాంతి కానుకగా రిలీజైన సినిమాలలో ఈ సినిమానే బెటర్ టాక్ ను సొంతం చేసుకుంది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వాల్తేరు వీరయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ‘వీర సింహా రెడ్డి’ , ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల్లో ఏ చిత్రం ఈ సంక్రాంతి విజేత అయ్యిందో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.