మాస్ మహారాజ్ రవితేజ, కార్తికేయ 2 చిత్రం తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద తలపడ్డారు. ప్రస్తుతం థియటర్లలో అవతార్ తప్ప వేరే పెద్ద సినిమా లేకపోవడం ఈ రెండు సినిమాలకు కలిసొచ్చే అంశం. అయితే ధమాకా చిత్రానికి రవి తేజ ఇమేజ్ ప్లస్ కాగా, 18 పేజెస్ కి నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ ప్లస్ కానుంది.

Video Advertisement

అందుతున్న వివరాల ప్రకారం.. ‘ధమాకా’ చిత్రానికి చాలా ప్రాంతాల్లో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. వింటేజ్ రవి తేజ అంటూ ప్రచారం చెయ్యడం, మాస్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ కట్ చెయ్యడం తో ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది.ఇక ఈ ఏడాది రవితేజ ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో కచ్చితంగా ధమాకా సినిమాతో హిట్ కొట్టాలని చాలా ప్రయత్నాలు చేసిన రవితేజ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. దీంతో రవి తేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి వచ్చాయని తెలుస్తోంది.

dhamaka or 18 pages which wins box office..??

మరో వైపు 18 పేజెస్ అంటూ కార్తికేయ 2 జోడి మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాకు ముల్టీప్లెస్ లలో మంచి ఆదరణ వస్తోంది. సుకుమార్ ఈ సినిమాకు కథ అందించటంతో ఓపినింగ్స్ బాగానే రాబట్టింది. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. కాకపోతే మాస్ సెంటర్స్ లో ధమాకా ప్రభావమే ఎక్కువగా ఉంది. 18 పేజెస్ క్లాస్ ఆడియన్స్ కే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.

dhamaka or 18 pages which wins box office..??

అయితే క్రిస్మస్ వీకెండ్ గడిస్తే కానీ 18 పేజెస్ రిపోర్ట్ తెలీదు. అంతే కాకుండా మళ్ళీ సంక్రాంతి కి వచ్చే సినిమాల లోపు వీటికి వేరే పోటీ లేదు. కాబట్టి మంచి పాజిటివ్ టాక్ తో వెళ్లే సినిమా ఖచ్చితం గా హిట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అప్పటి వరకు కంటెంట్ పరం గా ఏ చిత్రం నిలుస్తుందో చూడాలి.