పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని రెట్టింపు చేస్తూ అభిమానుల గుండెల్లో నాటుకుపోయేలా చేసిన చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రం తో పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతం గా పెరిగిపోయింది. ఆ తర్వాత పదేళ్లు పవన్ కి సరైన హిట్ లేకపోయినా ఆయన క్రేజ్ చెక్కుచెదరలేదు. అప్పటికే ఐదు బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో జోరుమీదున్న పవన్‌కు ఈ సినిమా డబుల్‌ హ్యట్రిక్‌గా నిలిచింది. పవన్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌, హేయిర్‌ స్టైల్‌ అప్పట్‌లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో పవన్‌-భూమిక కెమిస్ట్రీకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు.

Video Advertisement

పవన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచినా ఖుషి సినిమాను తాజాగా రీరిలీజ్ చేశారు. ఖుషి సినిమా రిలీజ్ అయిన 22 ఏళ్ల తర్వాత ఖుషి సినిమాను రీరిలీజ్ చేశారు. న్యూ ఇయర్ కానుకగా పలు థియేటర్స్ లో ఖుషి సినిమా రీరిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాకు రీరిలీజ్ లోనూ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కొత్త సినిమా రిలీజ్ కు చేసినంత హడావిడి చేశారు ఫ్యాన్స్. థియేటర్స్ దద్ధరిల్లాయి. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. మొత్తంగా ఖుషి సినిమాను మరోసారి రికార్డులు క్రియేట్  చేశారు.

khushi movie re release collections..

రీ రిలీజ్ లో ‘ఖుషి’ ఏకంగా రూ.4.65 కోట్ల షేర్ ను రాబట్టి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకుముందు పోకిరి సినిమాకు దాదాపు 1.7కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా జల్సాను రీ రిలీజ్ చేశారు. ఆ సినిమాకు మూడు కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. జల్సా దెబ్బకు పోకిరి రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఖుషి తర్వాత రీ రిలీజ్ అయిన ఒక్కడు సినిమాకు 2.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఖుషి సినిమా మొదటి రోజు రీ రిలీజ్ లో నైజాం ఏరియాలో 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. జల్సా సినిమా 1.26 కోట్లను అందుకుంది. ఇక ఆ తర్వాత ఒక్కడు 90 లక్షల కలెక్షన్స్ తో మూడవ స్థానంలో నిలిచింది.

source: https://www.newstap.in/cinema/re-release-box-office-okkadu-fails-to-beat-kushis-record-1456397?infinitescroll=1