మరాఠిలో ‘నటసామ్రాట్’ అనే టైటిల్‌తో రూపొందిన చిత్రాన్ని కృష్ణ వంశీ ‘రంగమార్తాండ’ పేరుతో తెలుగులోకి రీమేక్ చేశారు. ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.30 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ‘హౌస్‌ఫుల్ మూవీస్’, ‘రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ల పై కాలిపు మధు, ఎస్. వెంకట్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Video Advertisement
ఉగాది కానుకగా వచ్చిన ఈ చిత్రం మౌత్ టాక్ తో పబ్లిసిటీ ని సంపాదించింది. కానీ ‘రంగమార్తాండ’కు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అనుకున్న రేంజ్‌లో వసూళ్లు రాలేదు. మొదటి రోజు రూ. 43 లక్షలు షేర్, రూ. 95 లక్షలు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రమోషన్స్ పెద్దగా చేయకపోయినా.. 5 రోజుల వరకు బాగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆరో రోజు నాటికి కలెక్షన్లు డౌన్ అయ్యాయి.
ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.83 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.67 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇంకో రెండు రోజుల్లో ‘దసరా’ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది కాబట్టి.. ‘రంగమార్తాండ’ చిత్రం నిలబడటం కష్టమనే చెప్పాలి.
ఇక అదే రోజు తన స్వీయ దర్శకత్వంలోనే విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన దీనికి లియాన్ జేమ్స్ దీనికి సంగీతం అందించారు. ఇందులో అక్షర గౌడ, రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
‘దాస్ కా ధమ్కీ’ మూవీపై అంచనాలు ఉండడంతో పాటు విశ్వక్ సేన్ మార్కెట్ కారణంగా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఆరో రోజు ఈ చిత్రానికి వసూళ్లు కాస్త తగ్గాయి. కానీ వరల్డ్ వైడ్ గా 39 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. మొత్తానికి ఇప్పటివరకు 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 1.95 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఒకే రోజు విడుదలైన ఈ రెండు చిత్రాల్లో విశ్వక్సేన్ ‘దాస్ కా ధమ్కీ’ తో ముందంజ లో ఉన్నాడు.