తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ పండగ పూట తమ సినిమాలను విడుదల చేయాలని బడా హీరో నుంచి అప్ కమింగ్ హీరోల వరకు అందరు ఉవ్విళూరుతారు. సంక్రాంతి 2023 రిలీజ్ విషయానికి వస్తే.. అజిత్ నటించిన తునీవు ( తెగింపు) జనవరి 11వ తేదీన, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12వ తేదీన, విజయ్ నటించిన వారిసు (వారసుడు) జనవరి 12వ తేదీన, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. అయితే నలుగురు స్టార్ హీరోలు కావడంతో ఈ సంక్రాంతి రిలీజ్ సినిమాలపై భారీ క్రేజ్ నెలకొంది.

Video Advertisement

ఈ సినిమాల విషయానికి వస్తే ఈ సీజన్‌లో విడుదలైన బాలయ్య సినిమాల్లో ఎక్కువ చిత్రాలు సంచలన విజయం సాధించాయి. ఇక ఈ సంక్రాంతి సీజన్‌లో కూడా బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలయ్య వీరాభిమాని గోపీచంద్ మలినేని తీసిన ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందించాడు. అలాగే ప్రమోషన్స్ లో ఈ చిత్రం కాస్త ముందంజ లో ఉంది. అలాగే ఈ చిత్రం హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి.

pongal releasing movies this year..

మరో వైపు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవికి జంటగా శ్రుతి హాసన్ నటించింది. మాస్ మహరాజ్ రవితేజ ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించగా.. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతం లో డాన్స్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఇప్పటికే నాలుగు పాటలు విడుదల అయ్యాయి. అన్ని పాటలూ అభిమానుల్ని అలరించాయి. ప్రమోషన్స్ లో ఈ చిత్రం అదరగొడుతోంది. కానీ ఈ చిత్రానికి ఎక్కడో కాస్త నెగిటివిటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదల కాలేదు.

pongal releasing movies this year..

మరోవైపు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తలపతి విజయ్ చేస్తున్న సినిమా ‘ వారసుడు’. దిల్ రాజు చేతిలో మెజార్టీ థియేటర్లు ఉన్న కారణంగానే వారసుడు సినిమాను ఎక్కువ థియేటర్‌ లలో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో బాలయ్య, చిరు చిత్రాలకు తగినన్ని థియేటర్లు కేటాయించలేదని ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారసుడు చిత్రానికి హైప్ ఎక్కువగా ఉంది. తమిళనాడులో విజయ్ నేరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక్కడ దిల్ రాజు తన క్రేజ్ తో ఈ చిత్రం హిట్ చేసేలాగే ఉన్నాడు.

pongal releasing movies this year..

అలాగే ఈ సంక్రాంతికి మరో డబ్బింగ్ చిత్రం తెగింపు కూడా తెలుగులో విడుదల కాబోతుంది. అజిత్ హీరోగా తమిళంలో ‘తునీవు’ చిత్రం రూపొందింది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి హెచ్. వినోత్ దర్శకత్వం వహించాడు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం యాక్షన్ ప్రేమికులకు నచ్చే విధంగానే ఉంది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమాకి ప్రమోషన్స్ చెయ్యట్లేదు. అయితే ఈ సినిమాని కూడా తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారని టాక్.

pongal releasing movies this year..

మొత్తంగా ఈ సంక్రాంతి బరిలో ఉన్న నాలుగు చిత్రాల్లో బాలయ్య వీర సింహ రెడ్డి, అజిత్ వారసుడు చిత్రాలకు హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో వైపు ప్రమోషన్స్ తక్కువగా చేస్తున్న వాల్తేరు వీరయ్య, అజిత్ తెగింపు చిత్రాలు ఎటువంటి విజయాన్ని నమోదు చేసుకుంటాయో చూడాలి.. మొత్తమ్మీద ఈ సంక్రాంతికి నలుగురు బడా హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడనున్నారు.