యంగ్ హీరో అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’. డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 28న రిలీజ్ అయ్యింది. కానీ మొదటి షో నుండే నెగెటివ్ టాక్‌ వచ్చింది. డైరెక్టర్, నిర్మాతల పై ఆడియెన్స్ అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.

Video Advertisement

 

 

అయితే ఈ మూవీ ఫలితానికి ప్రతి ఒక్కరు దర్శకుడు సురేందర్ రెడ్డి నే బాధ్యుడ్ని చేస్తున్నారు. ఈ మూవీ లో అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్, పెర్ఫార్మన్స్ పై ప్రశంసలు వస్తున్నప్పటికీ దర్శకుడిదే మొత్తం తప్పు అని అంటున్నారు అక్కినేని ఫాన్స్. ఏజెంట్ సినిమా ఫలితం సురేందర్ రెడ్డి కెరీర్ ను దారుణంగా దెబ్బ తీసే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

who affected by agent movie result..!!

షూటింగ్ మరియు ఫారన్ లొకేషన్ ల మీద పెట్టిన ఫోకస్ సురేందర్ రెడ్డి కథ ,స్క్రీన్ ప్లే మీద మాత్రం పెట్టలేకపోయారు. కథ చాలా రెగ్యులర్,రొటీన్ గా అనిపిస్తుంది. ఎలాంటి కొత్తదనం లేకుండా అదే అవుట్ డేటెడ్ కథ,దానికి తోడు కన్ఫూజన్ . కెరీర్ మొదట్లో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన సురేందర్ రెడ్డి.. ఆ తర్వాత తీసిన చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తున్నా ఆ సినిమాలు ఫెయిల్యూర్ గా నిలుస్తున్నాయి.

who affected by agent movie result..!!

ఏజెంట్ సినిమా హిట్ అయితే అఖిల్, సురేందర్ రెడ్డి కెరీర్ పుంజుకుంటుందని అంత భావించారు. కానీ ఇప్పుడు అంతా తారుమారు అయ్యింది. సురేందర్ రెడ్డి 18 ఏళ్ల కెరీర్ లో అందుకున్న విజయాలు మాత్రం నాలుగే అని చెప్పాలి. అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, ధ్రువ వంటి సినిమాలు ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ ఇప్పుడు ఈ మూవీ ప్లాప్ కావడం తో ఈయన్ని నమ్మి సినిమా తీసేందుకు ఏ హీరో ముందుకొస్తాడో చూడాలి.

who affected by agent movie result..!!

ప్రస్తుతం అందరు దర్శకులు సినిమాలను త్వరగా పూర్తి చేస్తుంటే సురేందర్ రెడ్డి మాత్రం సినిమాలను చాలా లేట్ గా తీస్తూ నిర్మాతలపై భారాన్ని మోపుతున్నారని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ మూవీ వల్ల ఈయన తర్వాత సినిమాలు కూడా కష్టమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.