తెలుగు మెగాస్టార్… మలయాళం మెగాస్టార్… వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప..? ఈ సమాధానం నిజమే కదా..?

తెలుగు మెగాస్టార్… మలయాళం మెగాస్టార్… వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప..? ఈ సమాధానం నిజమే కదా..?

by Mohana Priya

ఒక్కొక్క భాషలో ఒక్కొక్క సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ప్రతి సినిమా ఇండస్ట్రీకి కొంత మంది స్టార్ హీరోలు ఉంటారు. కానీ భారతీయ సినిమా ఇండస్ట్రీకి మాత్రం, అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలలో గొప్ప నటులని పరిశీలించి, వారిని ఇండియాలోనే బెస్ట్ నటులు అనే ఒక కేటగిరీలోకి చేర్చుతారు. వారిలో ఒకరు చిరంజీవి. చిరంజీవి చేయని పాత్ర లేదు.

Video Advertisement

కెరీర్ మొదలు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రకమైన పాత్రలని చిరంజీవి చేశారు. మధ్యలో కొన్ని ప్రయోగాత్మక సినిమాలు కూడా చిరంజీవి చేశారు. కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే కమర్షియల్ సక్సెస్ కూడా ముఖ్యమైనది. అందుకే, ఒకపక్క ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే, మరొక పక్క కమర్షియల్ సినిమాలు కూడా చేశారు.

ప్రయోగాత్మక సినిమాల ద్వారా తనలోని నటుడిని నిరూపించుకున్నారు. కమర్షియల్ సినిమాల ద్వారా, తనలోని డాన్సర్ ని, ఒక హీరోని నిరూపించుకున్నారు. దాంతో ఈ రెండిటిని సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ చిరంజీవి సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే చిరంజీవి గత కొంత కాలం నుండి ప్రయోగాత్మక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా కమర్షియల్ సినిమా. ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా కాస్త ప్రయోగాత్మక సినిమా అయినా కూడా కమర్షియల్ పరంగానే ఈ సినిమాలో చాలా అంశాలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఇలాగే ఉన్నాయి.

who is better between mammotty and chiranjeevi

అయితే మరొక పక్క, చిరంజీవి లాగానే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి, ఒకపక్క కమర్షియల్ సినిమాలు కూడా చేసి స్టార్ హీరో గుర్తింపుని సంపాదించుకున్నారు మమ్ముట్టి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అయితే, మలయాళంలో మెగాస్టార్ మమ్ముట్టి. ఇద్దరికీ దాదాపు ఒకటే రకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కానీ, మమ్ముట్టి మాత్రం ఇప్పటికీ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఒక పక్క చిరంజీవి కమర్షియల్ సినిమాలకు షిఫ్ట్ అయ్యారు. కానీ, ఇంత వయసు వచ్చినా మమ్ముట్టి మాత్రం ఇప్పటికీ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు. తనలోని నటుడిని ఇప్పటికి కూడా నిరూపించుకుంటున్నారు.

ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు కూడా మమ్ముట్టి భ్రమయుగం అనే మరొక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది. మమ్ముట్టి కూడా ఇండియాలో ఉన్న టాప్ నటులలో ఒకరు. ఇద్దరినీ పోల్చి చూడలేము. ఎవరి ఇమేజ్ వారిదే. కానీ ఒకవేళ పోల్చి చూస్తే మాత్రం, మమ్ముట్టి రెండు మెట్లు పైన ఉన్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇప్పటికి కూడా మమ్ముట్టి తాను గొప్ప నటుడిని అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ఈ విషయంలో మాత్రం మమ్ముట్టి కొంచెం ముందు ఉన్నారు.

ALSO READ : “రవితేజ” పక్కన హీరోయిన్‌గా, వదినగా నటించిన… ఒకే ఒక్క నటి ఎవరో తెలుసా..?


You may also like

Leave a Comment