Ads
ఆది సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వినాయక్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా 2002 మార్చి 28న విడుదల అయ్యింది.
Video Advertisement
ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది. అప్పట్లో.. దాదాపు 98 సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఈ సినిమా తోనే వివి వినాయక్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అంతకుముందే ఆయనకు కో డైరెక్టర్ గా పని చేసిన అనుభవం కూడా ఉంది.
Also Read: ఇతర హీరోల ఈవెంట్స్‌లో … వారినే “డామినేట్” చేసిన 10 స్టార్ హీరోస్..!
నిజానికి వినాయక్ తన మొదటి సినిమాను బాలయ్య బాబుతో తీయాలని అనుకున్నారు. ఆది కథను కూడా బాలయ్య బాబు కోసమే సిద్ధం చేసుకున్నారు. కానీ బాలయ్యబాబు తో ఈ సినిమా చేయడం కుదరలేదు. అసలు ఇందులో సన్నివేశాలు కూడా బాలయ్యబాబు కోసమే రాసుకున్నారట. సినిమాలో ఇద్దరు బాలయ్య లు ఉంటారని.. బాలయ్య తమ్ముడు చిన్నతనం లో విలన్ పై బాంబులు విసురుతాడు అని.. అన్న గా చేసిన బాలయ్య పెద్ద అయ్యాక పోలీస్ అయ్యి తమ్ముడిని కొట్టాల్సి వస్తుంది.. టాటా సుమో లు లేవడం.. ఇలాంటి సన్నివేశాలను రాసుకున్నారట.
Also Read: “మేము సంతోషంగా బతకడం ఇష్టం లేదా…?” జానకి కలగలేదు హీరో “అమర్‌దీప్” కామెంట్స్..!
అయితే అనుకోకుండా ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేయాల్సి రావడంతో అందుకు తగ్గట్లు సన్నివేశాలను మార్చుకున్నారట. అలా ఆది సినిమాకు మొదట బాలయ్య బాబుని అనుకున్నా.. ఎన్టీఆర్ తో చేయాల్సి వచ్చింది. మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా బాగానే హిట్ అయ్యింది. వినాయక్ తన మొదటి సినిమాను బాలయ్య బాబుతో చేయలేకపోయినా.. రెండవ సినిమా “చిన్న కేశవ రెడ్డి” ని మాత్రం బాలయ్య తోనే చేసారు.
Also Read: నిజమైన ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా తెలియాలంటే… ఈ కథ తప్పక చదవాల్సిందే..!
End of Article