ఐపీఎల్ చరిత్రలో తొలి మహిళా ఆక్షనీర్ గురించి ఈ విషయాలు తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

ఐపీఎల్ చరిత్రలో తొలి మహిళా ఆక్షనీర్ గురించి ఈ విషయాలు తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by kavitha

Ads

ఐపీఎల్ 2024 మినీ వేలంలో ప్లేయర్స్ ను దక్కించుకోవడం కోసం మంగళవారం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఈసారి జరిగిన వేలంలో ఎన్నో సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి వేలంను ఇండియాలో కాకుండా దుబాయ్ లో నిర్వహించారు.

Video Advertisement

అంతే కాకుండా 2024 ఐపీఎల్ వేలానికి ఇంకో ప్రత్యేకత ఉంది. పదహారేళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఐపీఎల్‌ ఆక్షన్ ను ఒక మహిళ నిర్వహించింది. ఇప్పటివరకు ఐపీఎల్ వేలంను ముగ్గురు నిర్వహించారు. నాలుగో వ్యక్తిగా  మల్లికా సాగర్ నిలిచింది. మరి ఆమె ఎవరో? ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో ప్రారంభం అయ్యింది. ఈ వేలంలో 214 మంది భారతీయ ఆటగాళ్లు,  119 విదేశీ ఆటగాళ్లతో కూడిన మొత్తం 333 మంది ఆటగాళ్లు  77 స్లాట్‌ల కోసం పోటీపడ్డారు. అయితే దుబాయ్ లో నిర్వహించిన ఈ వేలంకు మల్లికా సాగర్ నిర్వాహకురాలుగా వ్యవహరించారు. అయితే ఐపీఎల్ వేలం నిర్వాహకురాలుగా ఓ మహిళను నియమించడం ఇదే మొదటిసారి.
మల్లికా సాగర్‌కు వేలం నిర్వహించడంలో చాలా అనుభవం ఉంది. గతంలో ఆమె మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వాహకురాలుగా వ్యవహరించింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2003, 2024 సీజన్లతో పాటుగా,  ఆమె కబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌ ఆక్షన్స్ కూడా నిర్వహించారు. ఆమె వేలం నిర్వహించిన తీరు పై పెద్ద ఎత్తున్న ప్రశంసలు వచ్చాయి. దాంతో ఆమెను ఐపీఎల్ వేలంకు సెలక్ట్ చేశారు.
ఆమె ముంబైకి చెందిన వ్యక్తి. ఆమె ఆర్ట్ హిస్టరీ స్టడీస్‌ ను ఫిలడెల్ఫియాలో బ్రైన్ మావర్ కళాశాలలో పూర్తి చేసింది. 2001లో 26 సంవత్సరాల వయసులో వేలం సంస్థ క్రిస్టీస్‌లో మల్లిక కెరీర్‌ను మొదలుపెట్టింది. క్రిస్టీస్‌ లో మల్లికా సాగర్ తొలి ఇండియన్ ఆక్షనీర్ గుర్తింపు పొందింది. మల్లికా తన 22 ఏళ్ళ  అనుభవంలో అనేక వేలంలు నిర్వహించింది. సమకాలీన భారతీయ ఆర్ట్ వేలంను నిర్వహించిన మొదటి వ్యక్తి మల్లికనే. క్రికెట్ వేలం గురించి ఆక్షనర్ హ్యూ ఎడ్మీడ్స్ వేలం వీడియోలు చూసి నేర్చుకున్నట్లుగా మల్లికా సాగర్‌ తెలిపారు.

Also Read: బ్యాట్ కొనుక్కోవడానికి కూడా స్థోమత లేదు… ఇప్పుడు ఐపీఎల్ లో 5.8 కోట్లు..! ఈ ప్లేయర్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా..?


End of Article

You may also like