కృష్ణ వ్రింద విహారి సినిమాలో హీరోయిన్‌గా నటించిన “షెర్లీ సెటియా” ఎవరు..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి..?

టాలీవుడ్ లో చాలా సినిమాలతో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎక్కువగా బాలీవుడ్ లేదా కోలీవుడ్ నుంచి కొత్త హీరోయిన్లు వస్తారు. వీరిలో సింహ భాగం కోలీవుడ్ హీరోయిన్లదే.

కానీ నాగ శౌర్య తన కొత్త సినిమా కోసం ఏకంగా విదేశీ భామను హీరోయిన్ గా పరిచయం చేసారు. న్యూజీలాండ్ కు చెందిన ఫేమస్ సింగర్ షెర్లీ సెటియా ను నాగ శౌర్య తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’ తో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది.

who is sherley setia
ఈ చిత్ర ట్రైలర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో అందరి ద్రుష్టి ఈ బ్యూటీ పై పడింది. చాలా మంది స్టార్ హీరోయిన్లు కూడా తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్న తరుణం లో ఈ కివీస్ బ్యూటీ తన తొలి చిత్రంలోనే తన పాత్ర కు డబ్బింగ్ చెప్పుకుంది. దీని కోసం ఈమె తెలుగు కూడా నేర్చుకుందట.

who is sherley setia
ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగులో ఒక పాట పాడి అందర్నీ ఆశ్చర్య పరచింది షెర్లీ. స్వతహాగా సింగర్ అయిన ఈ భామ ఫోర్బ్స్ మ్యాగజైన్ పై కూడా మెరిసింది. టాలీవుడ్ కి ఎంటర్ కాకా ముందు ఈమె బాలీవుడ్ లో రెండు చిత్రాలు చేసింది. ఒక వెబ్ సిరీస్ కూడా చేసింది షెర్లీ. అంతే కాకుండా పలు ఆల్బమ్స్ పాడి రిలీజ్ చేసింది. ఈమె యూట్యూబ్ ఛానల్ కు 3.71 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు.

who is sherley setia
నాగ శౌర్య హీరోగా, అనీష్ కృష్ణ దర్శకత్వం లో వచ్చిన ‘కృష్ణ వ్రిందా విహారి” చిత్రంలో వ్రిందా పాత్రలో , క్యూట్ గా నటించింది ఈ కివీస్ భామ. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

who is sherley setia

మహతి స్వర సాగర్ స్వరాలను అందించారు. కాగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్యూట్, టాలెంటెడ్ యాక్ట్రెస్ కి తెలుగులో అవకాశాలు వస్తాయో రావో చూడాలి.