పద్మశ్రీ వరించిన శశి సోనీ ఎవరో తెలుసా..? అసలు ఈమెకి పద్మశ్రీ ఎందుకు ఇచ్చారంటే..?

పద్మశ్రీ వరించిన శశి సోనీ ఎవరో తెలుసా..? అసలు ఈమెకి పద్మశ్రీ ఎందుకు ఇచ్చారంటే..?

by kavitha

Ads

కేంద్ర  ప్రభుత్వం ఈ ఏడాది పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డులను సమాజంలో పలు రంగాలలో తమ పని ద్వారా  గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తులకు అందచేస్తారు. ఈసారి ఐదుగురికి పద్మవిభూషణ్, పదిహేడు మందికి పద్మభూషణ్ ప్రకటించగా, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించారు.

Video Advertisement

పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన జాబితాలో శశి సోనీ కూడా ఉన్నారు. ఆమె కర్నాటకకు చెందిన  పారిశ్రామికవేత్త. 10,000 వేల రూపాయలతో ప్రారంభించిన ఆమె సంస్థ ఇప్పుడు 500 మిలియన్ల డాలర్లగా ఉంది.  గృహిణి నుండి  పారిశ్రామికవేత్తగా మారిన ఆమె గురించి ఇప్పుడు చూద్దాం..
69 ఏళ్ల శశి సోని భారత మహిళా వ్యాపారవేత్తల లిస్ట్ లో సుపరిచితమైన పేరు. మహిళా పారిశ్రామికవేత్త శశి సోనీ ఇజ్మో లిమిటెడ్ వ్యవస్థాపకురాలు. ఆమె కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ సొల్యూషన్ ప్రొవైడర్. పద్మశ్రీ కన్నా ముందు, ఆమె అనేక అవార్డులతో గౌరవించబడింది. ఆమె 1990లో మహిళా గౌరవ్ అవార్డును అందుకుంది.శశి సోనీ పాకిస్తాన్‌లో 1941లో  ఏప్రిల్‌ 4న లాహోర్‌లో జన్మించారు. అయితే ఆమెకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె ఫ్యామిలీ ఢిల్లీకి వచ్చింది. అలా ఆమె విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది.
శశిసోనీ 1971లో 30 సంవత్సరాల వయసులో సొంతంగా బిజినెస్ మొదలుపెట్టారు. 10,000 రూపాయల పెట్టుబడితో ‘డీప్ ట్రాన్స్‌పోర్ట్‌’ను మొదలుపెట్టారు. ఆ వ్యాపారాన్ని 1975 వరకు కొనసాగించారు. ఆ తర్వాత అదే ఏడాది ముంబైలోని ములుంద్ ఏరియాలో  ‘దీప్ మందిర్ సినిమా’ అనే తొలి ఏసీ థియేటర్‌ను మొదలుపెట్టారు. దీనిని ఆమె 1980 వరకు నడిపించారు. వ్యాపారం ప్రారంభించిన మొదట్లో ఆమె అసమానతలతో పోరాడేలా చేసింది. డీప్ ఆక్సిజన్ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థను స్థాపించే వరకు ఆమె పోరాటం కొనసాగింది.
మైసూర్‌లోని స్థాపించిన  పారిశ్రామిక గ్యాస్ తయారీ మరియు చిన్న తరహా గ్యాస్ తయారీతో ఆమె శ్రమ ఫలించి, ఆదాయం సమకూరింది. ఆ తరువాత సాంకేతిక రంగంలో ఆమె అడుగుపెట్టారు. ఇప్పుడు ఇంటరాక్టివ్ మార్కెటింగ్ సొల్యూషన్స్‌లో ప్రపంచ అగ్రగామి ఉన్న ఐజెడ్‌ఎంఓ లిమిటెడ్‌ కంపెనీని 2005లో స్థాపించారు.
ప్రస్తుతం ఈ కంపెనీ యూరప్, అమెరికా, ఆసియాలో హైటెక్ ఆటోమోటివ్, ఇ-రిటైలింగ్ సొల్యూషన్‌లను అందిస్తుంది. ఈ కంపెనీకి శశి సోనీ చైర్‌పర్సన్‌. ఈ కంపెనీ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ లిస్ట్ లో చేరింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 4,150 కోట్ల రూపాయలకు చేరింది.శశి సోనీ డీప్ జనసేవా సమితి మెంబర్. వ్యవస్థీకృత ఉద్యోగాలు, మహిళలకు ఉద్యోగాలు, పెన్షన్ పథకాలు ప్రారంభించడం, శారీరక వికలాంగులకు నిధులు సమీకరించడం మొదలైన వాటి ద్వారా  సమాజానికి అపారమైన కృషి చేస్తోంది.

Also Read: “బడ్జెట్” అంటే ఏంటి.? ఆ పదం ఎలా వచ్చింది.?


End of Article

You may also like